Advertisement
Google Ads BL

నిజంగానే సుమకి ఆమె అంటే అసూయా?


టాలీవుడ్ టాప్ యాంకర్ ఎవరయ్యా అంటే టక్కున సుమ కనకాల అని చెబుతారు. అదే టాలీవుడ్ హాట్ యాంకర్ అనగానే అనసూయ అనే చెబుతారు. టాలీవుడ్‌లో సుమ యాంకరింగ్ అంటే చిన్న పెద్ద అందరూ చెవి కోసుకుంటారు. స్పాంటేనియస్‌గా మాట్లాడడం అందరినీ అల్లరి చేస్తూ ఆట పట్టించడంలో సుమ కనకాల ముందుంటుంది. అనసూయ మాత్రం హాట్‌గా అందంగా అందరిని ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు సుమ కనకాలకి టాలీవుడ్‌లో ఓ యాంకర్ అంటే అసూయ, కుళ్ళు అని చెప్పడం చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా సుమ కనకాల అలీతో జాలీగా ప్రోగ్రాంకి రాగా, అక్కడ అలీ సుమని మీకు ఏ యాంకర్‌ని చూస్తే అసూయ కలుగుతుంది, ఎవరిని చూస్తే కుళ్ళు కలుగుతుంది అని అడగగా.. సుమ ఏం వెతుక్కోకుండా సమాధానం చెప్పింది.

Advertisement
CJ Advs

తనకి అనసూయని చూస్తే అసూయ కలుగుతుంది అని చెప్పి అందరికి షాకిచ్చింది. అనసూయని చూస్తే కుళ్ళు అని కూడా చెప్పింది. ఎందుకు తనకి అనసూయని చూస్తే కుళ్ళు, అసూయ కలుగుతాయో చెప్పు కొచ్చింది. ఎందుకంటే అనసూయ హైట్ చూస్తుంటే నిజంగానే కుళ్లు వస్తుందని.. అందం చూస్తుంటే అమ్మాయిగా తనకు అనసూయని చూస్తే అసూయ అనేది కలుగుతుందని చెబుతుంది. అయితే ఎవరిని చూసినా కలగని అసూయ ఒక్క అనసూయని చూస్తేనే కలుగుతుంది అని చెబుతుంది సుమ. అంతేకాకుండా ఒకే ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు మనకన్నా ఎక్కువ సంపాదించినా, మనకన్నా బావున్నా సహజంగానే కుళ్ళు వస్తుంది అని.. అనసూయని చూస్తే తనకి ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అందరికి షాకిచ్చింది. ఇక సుమ ఎంత ఫన్నీగా చెప్పినా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం సుమకి అనసూయ అంటే కుళ్ళంట! సుమకి అనసూయ అంటే అసూయట! అంటూ స్ప్రెడ్ చేస్తున్నారు.

Anchor Suma sensational comments on anchor Anasuya:

I Hate Anasuya says anchor Suma Kanakala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs