Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పండగలాంటి న్యూస్!


పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతికి సినిమాలకు దూరమై రెండేళ్లు. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ తర్వాత సినిమాలను వదిలేసి, అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. అయితే రాజకీయాల్లో తన పవర్ పనిచేయకపోవడంతో.. మళ్లీ సినిమాలంటూ రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ ఫ్యాన్స్ పవన్‌ని రాజకీయనాయకుడిగా చూడలేకపోయారు. ఫలితమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సున్నాగా మిగలడం. అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నాడని తెలియగానే పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. వకీల్ సాబ్‌తో నాలుగు నెలలోనే పవన్.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాడనుకుంటే కరోనా అడ్డుపడి పవన్ ఆశల మీద, ఫ్యాన్స్ ఆనందం మీద నీళ్లు చల్లింది.

Advertisement
CJ Advs

అయితే పవన్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ లుక్ తోనే నెలలుగా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తుంటే కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతూనే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు పండగ లాంటి వార్త. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా టీజర్‌ని విడుదల చేసేందుకు వకీల్ సాబ్ టీం ప్లాన్ చేస్తుందట. సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదల చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట. కరోనా ముగిస్తే ఉన్న 20 రోజుల షూటింగ్ పూర్తి చేసేస్తారు. కానీ కరోనా ఇలా ఉంటే.. పవన్ టీజర్‌తో ఫ్యాన్స్‌ని శాటిస్ ఫై చేయడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే పవన్ బర్త్‌డే హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

Good News to Power Star Pawan Kalyan Fans:

Pawan Kalyan Vakeel Saab Teaser Release Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs