Advertisement
Google Ads BL

విశ్రాంతి.. ఇలియానా ఇలా మాట్లాడుతుందేంటి?


సౌత్ సినిమాల్లో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ పిలవగానే చెక్కేసిన భామ ఇలియానా అక్కడా ఓ అన్నంత సక్సెస్ కాలేదు కానీ.. బాలీవుడ్ మీదున్న మోజులో పడి సౌత్ ఆఫర్స్‌ని కాలదన్నింది. బాలీవుడ్ అవకాశాలను పక్కనబెట్టి ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్‌తో చట్టాపట్టాలేసుకుని తిరిగి పెళ్లి వరకు వచ్చాక బ్రేకప్ చేసుకున్న ఇలియానా తర్వాత చాలా డిప్రెషన్ అనుభవించిందట. తాజాగా తన బ్రేకప్ విషయాలను పంచుకున్న ఇలియానా సౌత్‌లో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తుందని అంటున్నారు. తక్కువ పారితోషకాన్ని సీనియర్స్ తో కలిసి నటించేందుకు కూడా ఇలియానా చూస్తుందని అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఇలియానా చేసిన ఓ ట్వీట్ చూస్తే ఇలియానా ఇక నటనకు స్వస్తి పలుకుతుందేమో అని అనిపిస్తుంది. లేదంటే అంత వైరాగ్యంగా ఎందుకు మాట్లాడుతుంది. ఇంతకీ ఇలియానా చేసిన ట్వీట్ ఎలా ఉంది అంటే... తనలో మాటల్లో చెప్పలేని తెలియని నిస్సహాయత ఆవరించిందని...  అయితే త‌న‌లో క‌లిగే ఈ భావ‌న‌ల గురించి లోతుగా ఆలోచిస్తే... ఇప్పటి వరకు నా శరీరంతో పాటు మ‌న‌సు కూడా అల‌సిపోయింద‌నే నిర్ణయానికి వచ్చానని చెప్పడమే కాదు.. మనసుకి, శరీరానికి రెండింటికి విశ్రాంతి కావాలనిపిస్తోందని చెప్పడం చూస్తుంటే ఇలియానా ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందేమో అనిపిస్తుంది. లేదంటే ఇలాంటి ట్వీట్ ఎందుకు చేస్తుంది. అటు అవకాశాలు కూడా లేవు, ఇటు ప్రేమలో బ్రేకప్ అందుకే ఇలియానా ఇలా మాట్లాడి ఉండొచ్చు అని అంటున్నారు.

Heroine Ileana Takes Sensational Decision:

Actress Ileana wants Rest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs