Advertisement
Google Ads BL

మెగా మౌనానికి కారణం.. పవనేనా?


ఎప్పుడూ మెగా కాంపౌండ్ హీరోలతో పెట్టుకుని.. వాళ్ళని రచ్చ చేసి..  పైశాచిక ఆనందం పొందే రామ్ గోపాల్ వర్మని మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఆడుకుంటూనే ఉంటారు. రామ్ చరణ్ ఏదో లైట్ గా వదిలేస్తే.. నాగబాబు మాత్రం రామ్ గోపాల్ వర్మని సోషల్ మీడియాలో ఆడుకున్నాడు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ అంటూ నానా రచ్చ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో, ఎలా ఉండేవాడో, ఇండస్ట్రీలో ఎలాంటి పని చేసాడో, ఎన్నికల తర్వాత పవర్ స్టార్ అంటూ నానా యాగీ చేస్తూ పోస్టర్స్ మీద పోస్టర్స్ వదులుతున్నాడు. అయితే వర్మ ఏం చేసినా, ఎంత చండాలం చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించడం లేదు.

Advertisement
CJ Advs

అది చూసిన వర్మ మరింతగా రెచ్చిపోతున్నాడు తప్ప తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ వర్మ పై ఎదురు దాడి చేస్తే రామ్ గోపాల్ వర్మకి పబ్లిసిటీ వచ్చేది. కానీ వర్మని మెగా కాంపౌండ్ పట్టించుకోవడం లేదు. కనీసం నాగబాబు కూడా వర్మని ఏమి అనకుండా ఏదేదో  మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే రెచ్చిపోయి.. సోషల్ మీడియాకెక్కి రచ్చ చేసే నాగబాబు ఇప్పుడు పవర్ స్టార్ బయోపిక్ విషయంలో మాట్లాడక పోవడం వెనుక పవన్ ఉన్నాడేమో అనిపిస్తుంది. వర్మని కెలికితే అది మనకి మనమే రచ్చ చేసుకుని రోడ్డెక్కినట్టు.. అందుకే మీరెవరు మాట్లాడవద్దు.. వర్మ ఎంత వరకు వెళ్తాడో వెళ్లనీయండి.. మీరు మాత్రం సైలెంట్ గా ఉండండి అని మెగా హీరోలకు పవన్ చెప్పాడేమో.. లేదంటే ఈపాటికి వర్మపై మెగా హీరోలు ఒక్కొక్కరిగా వర్మను ఒలిచేసేవారే.

No Reaction on RGV film Power Star From Mega Family:

What is the Reason behind Mega silence?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs