Advertisement
Google Ads BL

రవితేజ బోణీ కొడితే.. వరుస పెడతారేమో..!!


కరోనా లాక్‌డౌన్‌తో అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. రామ్ అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకులకు మరోసారి తన ఊపు చూపుదామనున్నాడు. ఇక నాని - సుధీర్ బాబు ‘వి’ తో వచ్చేద్దామనుకున్నారు. అనుష్క భాగమతి తర్వాత భారీ గ్యాప్‌తో నిశ్శబ్దాన్ని చీల్చుదామనుకుంది. ఇక పవన్ ‘వకీల్ సాబ్’తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ప్లాన్ చేసాడు. కానీ కరోనా మహమ్మారి వలన ఏ ఒక్క సినిమా థియేటర్స్ లోకి దిగలేకపోయాయి. అలాగే ఎప్పుడు థియేటర్స్ తెరుచుకుంటాయో కూడా చెప్పలేని స్థితి. ఈలోపు ఓటిటి వాళ్ళు ఊపందుకుని ఒక్కో సినిమాని లాగేస్తున్నారు. ఇప్పటివరకు చిన్న చితక సినిమాలతో పని కానిచ్చినా ఓటిటి ఇంతకుముందే మీడియం రేంజ్ సినిమాలపై కన్నేసింది. కనుకనే భారీ ధర పెట్టి రామ్ రెడ్, వి, అనుష్క నిశ్శబ్దాలను కొనేద్దామని తిరిగారు. కానీ హీరోలు ఒప్పుకోలేదు.

Advertisement
CJ Advs

 

ఇప్పుడు ఓటిటి ద్వారా చిన్న చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ఓటిటికి ఓ పెద్ద సినిమా కావాలి. ఓటిటి క్రేజ్ పెరగాలి, ఇంకా వ్యూవర్ షిప్ పెంచుకోవాలంటే నానిని, రామ్‌ని, అనుష్కని ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి. అదే చేస్తున్నా కానీ సాధ్యపడటం లేదు. అయితే తాజాగా రవితేజ క్రాక్ సినిమాతో ఓటిటి‌లో ఎంటర్ అవ్వబోతున్నాడని అంటున్నారు. క్రాక్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ సినిమా షూట్ పూర్తి చేసి ఆ సినిమాని ఓటిటికి ఇచ్చేయాలని మూవీ టీమ్ భావిస్తుందట. ఇప్పటికే నిర్మాత ఠాగూర్ మధు ఓటిటి వాళ్లతో బేరసారాలకు దిగినట్లుగా టాక్. మరి రవితేజ అయినా తన సినిమాతో ఓటిటికి బోణి కొడితే.. మిగతావాళ్లు క్యూ కడతారేమో చూడాలి. ఇప్పటికే బాలీవుడ్ తారలంతా ఓటిటికి జై కొడుతున్నారు. కానీ మన హీరోలే ఇంకా బెట్టు చేస్తున్నారు. 

Krack Producer Discussions with OTT Platforms:

Raviteja Krack will Release in OTT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs