Advertisement
Google Ads BL

లవ్ స్టోరీ కోసం కొరియోగ్రాఫర్ గా మారనున్న సాయిపల్లవి..?


ఫిదా సినిమాతో తెలుగు తెరకి పరిచయమై ప్రేక్షకులని ఫిదా చేసిన సాయి పల్లవి, ఆ తర్వాత వరుసగా అవకాశాలని తెచ్చుకుంటూ దూసుకుపోతుంది. నటనకి ప్రాధాన్యమున్న విభిన్నమైన పాత్రలని తప్ప గ్లామర్ షో చేయనని తెగేసి చెప్పిన సాయి పల్లవి, ప్రస్తుతం మరో మారు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అన్నీ సవ్యంగా కుదిరితే ఈ సినిమా ఈ పాటికే రిలీజై ఉండేది. 

Advertisement
CJ Advs

కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో మిగతా భాగం షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నియమాల ప్రకారం కరోనా జాగ్రత్తలని తీసుకుంటూ మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు. రామోజీ ఫిలిమ్ సిటీలో ఒకానొక సాంగ్ చిత్రీకరణతో మొదలుపెడతారట.

అయితే ఇక్కడ గమ్మత్తేమిటంటే ఆ పాటకి హీరోయిన్ సాయిపల్లవి కొరియోగ్రఫి చేస్తుందట. సాయి పల్లవి ఎంతమంచి డాన్సరో అందరికీ తెలుసు. హీరోయిన్ అవకముందు ఆమె ఎన్నో షోస్ లో కనిపించింది. లవ్ స్టోరీ చిత్రంలోని ఈ పాటకి కొరియోగ్రఫీ చేయమని శేఖర్ కమ్ములే అడిగారని, అందుకు సాయిపల్లవి అంగీకరించిందని సమాచారం. మరి తన నటనతో ప్రేక్షకులని అబ్బురపరిచే సాయి పల్లవి కొరియోగ్రఫీతో కూడా మాయ చేస్తుందేమో చూడాలి.

Sai pallavi becoming choreographer for Love story..? :

Sai pallavi becoming choreographer for Love story..?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs