Advertisement
Google Ads BL

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో హీరో శర్వానంద్!


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. సోమ‌వారం రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వ‌చ్ఛందంగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన పార్క్ లో రాజ్యసభ సభ్యులు సంతోష్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి హీరో శర్వానంద్ మొక్క‌లు నాటారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాను. రోజు రోజుకు మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యంతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనందరం మొక్కలు నాటాలి. వాటిని సంర‌క్షించాలి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలి’’ అని పిలుపునిచ్చారు.

అదేవిధంగా త‌మ‌ ఇంటి పక్కన ఉన్న జిహెచ్ఎంసి పార్కులో యాదాద్రి విధానంలో మొక్కలు పెంచే ఏర్పాటు చేయడం జరుగుతుంద‌ని తెలిపిన శ‌ర్వానంద్‌, ఆ పార్కును తాను దత్తత తీసుకొని అందులోని మొక్కలను రక్షించే బాధ్యత తీసుకుంటాన‌ని చెప్పారు. పార్కులో అవసరమైన వాకింగ్ ట్రాక్‌ను, పార్కు అభివృద్ధి కోసం కావలసిన ఏర్పాట్లను త‌న‌ సొంత డబ్బులతో చేయడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. త‌న‌ ఆహ్వానం మేరకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌గారికి, మేయర్ బొంతు రాంమ్మోహన్ గారికి, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి ఆయ‌న కృతజ్ఞతలు తెలియ‌జేశారు.

రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్‌కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త కార్య‌క్ర‌మానికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌నీ, హీరో శ‌ర్వానంద్ స్వ‌చ్ఛందంగా ఆ ఛాలెంజ్‌ను స్వీక‌రించి, జీహెచ్ఎంసీ పార్కును ద‌త్త‌త తీసుకొని, అందులోని మొక్క‌లను ర‌క్షించే బాధ్య‌త తీసుకుంటాన‌ని చెప్ప‌డం మ‌రింత ఆనందాన్నిస్తోంద‌నీ అన్నారు.

అనంత‌రం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిర్మాత‌లు అనిల్ సుంకర (ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌)రామ్ ఆచంట, గోపి ఆచంట (14 రీల్స్ ప్ల‌స్‌) వంశీ, విక్కీ, ప్రమోద్ (యువి క్రియేషన్స్), సుధాకర్ చెరుకూరి (ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌)ల‌కు మొక్కలు నాటాలని శ‌ర్వానంద్‌ ఛాలెంజ్ ఇచ్చారు.

Sharwanand participated in Green India Challenge:

Sharwanand adopted GHMC Park
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs