Advertisement
Google Ads BL

‘వకీల్‌సాబ్’ షూటింగ్‌కు పవన్ రెడీ... కానీ!?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్నటివరకు షూటింగ్ విషయంలో ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడట. దిల్ రాజు - వేణు శ్రీరామ్ కాంబోలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. ఇంకా 20 శాతం మిగిలి ఉండగా కరోనా అడ్డుపడింది. అయితే పవన్ కళ్యాణ్ జులై నుండి సెట్స్ మీదకెళ్ళి వేగంగా షూటింగ్ పూర్తి చేసి క్రిష్ సినిమా కోసం రెడీ అవుదామనుకుంటున్నాడట. ఎలాగూ రాజకీయాలు స్తబ్దుగా ఉన్నాయి. కనీసం షూటింగ్ అయినా పూర్తి చేద్దామనుకుంటే.. కరోనా విజృంభణలో ఏం చేస్తాంలే అని దిల్ రాజే అంటున్నాడట.
అందుకే పవన్ సిద్దమే అని సంకేతాలు పంపినా.. దిల్ రాజు - వేణు శ్రీరామ్ లు ఏం మాట్లాడడం లేదట. ఇక పవన్ కళ్యాణ్ కి ఆయన భార్య పాత్రధారి షూటింగ్ చేస్తే సినిమా ఓ కొలిక్కి వచ్చినట్టే అని.. ఆ కీలక సన్నివేశాల షూటింగ్ కూడా అయ్యిపోతే క్రిష్ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైనా పర్వాలేదని పవన్ భావిస్తున్నాడట. మరి పవన్ రెడీ అన్నాక మిగతావారు లేట్ అంటే కష్టమే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రెడీ అయినా.. సెట్స్ మీదకెళ్ళినా అందరిని రిస్క్ లో పడెయ్యడం ఎందుకు అని మూవీ టీం భావిస్తుందట. అందుకే పవన్ కూడా కామ్ గా ఉన్నాడని అంటున్నారు. మరి పవన్ ముందుకొచ్చి షూటింగ్ మొదలెట్టినా సెట్స్ లో ఎవరికైనా పాజిటివ్ వస్తే పవన్ కూడా ఇబ్బంది పడాలి అందుకే.... పవన్ ఓకే అన్నా.. ఎవరూ ముందుకు రావడం లేదట.

Advertisement
CJ Advs

This is the Problem to Vakeel Saab Shooting:

Pawan Kalyan ready to Vakeel Saab Balance shoot.. but
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs