Advertisement
Google Ads BL

RRR బయ్యర్స్‌లో గుబులు.. కారణం అదే!


రాజమౌళితో సినిమా అనగానే హీరో హీరోయిన్స్ కథ ఏమిటి అని అడక్కుండానే ఎగిరి గంతేస్తారు. అది రాజమౌళి రేంజ్. ఆయన మీద నమ్మకం ఉండబట్టే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు RRR కథ వినకుండానే రౌద్రం -రణం - రుధిరం సినిమా ఒప్పేసుకుని సెట్స్ మీదకెళ్లారు. రాజమౌళిని నమ్ముకుంటే క్రేజుకి క్రేజు, ఫేమ్‌కి ఫేమ్, డబ్బుకి డబ్బు.. ఇలా అన్నీ వస్తాయనేది ఇప్పటికే ఎన్నో సినిమాలకు చూశాం. అందుకే ఆయనతో సినిమా కోసం అందరూ ఎదురు చూస్తారు, అవకాశం రాగానే అయన సినిమా సెట్స్‌లో వాలిపోతారు. అయితే తాజాగా రాజమౌళి పనితనం మీద అనుమానమో.. కరోనా భయమో తెలియదు కానీ.. RRR సినిమా బయ్యర్లకి కంగారు పుడుతుంది. RRR సినిమాని కరోనా కన్నా ముందే కొన్ని ఏరియాలను అమ్మినట్టుగా, కొన్ని ఏరియాల నుండి భారీ ఆఫర్స్ వచ్చినట్టుగా వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సినిమా RRR కి భారీ క్రేజ్ ఉంది. అందుకే RRR కి ఫ్యాన్సీ రేట్లకి అగ్రిమెంట్స్ చేసుకున్నారు కొంతమంది ఏరియా బయ్యర్లు. రాజమౌళి సినిమా కాబట్టి ఆ సినిమా ఎన్ని వాయిదాలు వేసుకున్నా మా డబ్బు మాకు రావడం పక్కా అనుకున్నారు. అందుకే నిర్మాత దానయ్య ఎంత అంటే అంతకి ఒప్పేసుకుని అడ్వాన్స్ ఇచ్చేసారు బయ్యర్లు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా అంతా తారుమారయ్యింది. రాజమౌళి అయినా, ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా ఎంత క్రేజ్ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్‌లోకి వస్తారంటే నమ్మకం తక్కువే. అందుకే RRR కి అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్లు ఆలోచనలో ఉన్నారట. అందుకే మేము పెట్టిన డబ్బు మళ్లీ వెనక్కి వస్తుందో రాదో అనే కంగారులో.. RRR నిర్మాతకు ఫోన్ చేసి అడ్వాన్స్ లు వెనక్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి రాజమౌళి సినిమా అయినా బయ్యర్లు ఆలోచించడం లేదు. అంతటికి కారణం కరోనానే. రాజమౌళి మీద నమ్మకం కూడా కరోనా కారణంగా సడలుతుంది.

Reason behind RRR Movie buyers fear :

RRR Movie Buyers wants Their Advance from Producer 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs