Advertisement
Google Ads BL

మరోసారి అనసూయకి షాకిచ్చిన రష్మీ!


అనసూయకి రష్మీ గౌతమ్ అదిరిపోయే షాక్ ఎప్పుడో ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు లాక్‌డౌన్ షాక్ ఏమిటి అనుకుంటున్నారా... గతంలో జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు అనసూయ కొన్ని ఎపిసోడ్స్ కి యాంకర్ గా చేసినప్పుడు ఆ షో క్రేజ్ మాములుగా లేకపోవడంతో.. అనసూయ చెట్టెక్కి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చెయ్యడంతో మల్లెమాల ప్రొడ్యూసర్స్ అనసూయకి షాకిచ్చి రష్మీ గౌతమ్‌ని జబర్దస్త్ యాంకర్‌గా తీసుకొచ్చారు. నాకు తెలియకుండానే రష్మీ జబర్దస్త్ కి వచ్చింది అని అనసూయ చాలాసార్లు వాపోయింది. మళ్లీ ఏమైందో ఏమో ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకర్ గాను, అనసూయని మళ్లీ జబర్దస్త్‌కి యాంకర్ గాను తీసుకున్నారు. అప్పటినుండి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకదానిమీద ఒకటి పోటీగా మిగతా టీవీ ఛానల్స్‌ని వణికిస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మూడు నెలల గ్యాప్‌తో బరిలోకి దిగిన కమెడియన్స్ అంతా కరోనా కామెడీతో జబర్దస్త్ స్టేజ్‌ని దడదడలాడించారు. రెండు వారాలుగా నూతన ఉత్సాహంతో అటు రష్మీ, ఇటు అనసూయలు యాంకరింగ్‌లో ఒకరిమీద మరొకరు పోటీ పడుతుండగా.. కమెడియన్స్ కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్‌ని ఓ ఊపు ఊపుతున్నారు. అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ మీద రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ టీఆర్పీలో దూసుకుపోతుంది. గత రెండు వారాలుగా అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కంటే రష్మి గౌతమ్ హోస్ట్ చేసే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌కే ఎక్కువ టీర్పీలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్. జబర్దస్త్ - ఎక్స్ట్రా జబర్దస్త్‌లు చూడటానికి ఒకేలా ఉండే షోస్ అయినా... రేటింగ్స్ విషయంలో మాత్రం రష్మిగౌతమ్ ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టం అయింది. మరి లాక్‌డౌన్ ముందు అనసూయ రష్మీ కన్నాముందుండేది. కానీ లాక్‌డౌన్  తర్వాత రష్మీ ముందు అనసూయ నిలబడలేకపోతుంది. 

Again Rashmi Gautham gives Shock to Anasuya :

Extra Jabardasth beats Jabardasth in Rating 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs