Advertisement
Google Ads BL

వర్మని ఈసారి ‘పవర్‌స్టార్’ ఫ్యాన్స్ వదిలేలా లేరు!


ఆర్జీవీ ఈ పేరు వింటే.. ఎప్పుడూ ఏదో ఒక సినిమా అంటూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే పేరు అంటారు. తన పబ్లిసిటీ కోసం ఎలాంటి పనులైనా చేయగల ఒకేఒక్కడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా అమృత - ప్రణయ్‌ల జీవిత కథ ‘మర్డర్’ అంటూ.. ఓ సినిమా ప్లాన్ చేసి కాంట్రవర్సీకి నెలవైన రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘పవర్ స్టార్’ అంటూ ఓ టైటిల్ పెట్టి పవన్ కళ్యాణ్ పై సినిమా మొదలు పెట్టాడు. పవన్ బయోపిక్ అంటూ పవన్ కళ్యాణ్ క్రేజీ పేరుని అంటే పవర్ స్టార్ టైటిల్ తో సినిమా మొదలెట్టడమే కాదు... పవర్ స్టార్ స్టిల్స్ అంటూ గంటకో ఫోటో వదులుతున్నాడు. సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న పవర్ స్టార్ హడావిడి అంతా ఇంతాకాదు.

Advertisement
CJ Advs

వర్మ చెప్పింది చేస్తాడు. అలాగే అతను అనుకున్న కేరెక్టర్స్ కి దగ్గరగా ఉన్న పాత్ర ధారులనే ఎంపిక చేసుకుంటాడు. వర్మలోని గొప్పదనం అదే. పవన్ పోలికలతో ఉన్న ఓ టిక్ టాక్ స్టార్ ని పట్టుకుని పవన్ కేరెక్టర్ వేయించడం, చిరులాంటి పోలికలున్న వాడిని తీసుకురావడం, త్రివిక్రమ్ లాంటి మరో వ్యక్తిని పరిచయం చెయ్యడం, పవన్ మ్యానరిజం, పవన్ స్టయిల్ ఎలా ఉంటుందో అలానే పవన్ కళ్యాణ్ పాత్ర చేస్తున్న ఆర్టిస్ట్ కనిపిస్తున్నాడు. అయితే పవన్ తనపై సినిమా చేస్తున్న రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి కోపముతో ఉన్నట్లుగా అనిపించడం లేదు. అందుకే ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు.

ఇంకా చెప్పాలంటే.. అసలు పవర్ స్టార్ లుక్ చూసి పవన్ కళ్యాణ్ ఫక్కున నవ్వాడానే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అయితే పవన్ కూల్ గా సైలెంట్ గా ఉన్నాడు. కానీ పవన్ ఫ్యాన్స్ ఊరుకోవాలిగా. తమ హీరోని బ్లేమ్ చేసినట్టుగా చూపిస్తే పవన్ ఫ్యాన్స్ చేతిలో వర్మకి మూడుతుంది. ఎవ్వరి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ.. పవన్ ఫ్యాన్స్ చేతిలో నుండి వర్మ తప్పించుకోవడం ఈసారి సాధ్యం కాదంటూ కొందరూ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో వర్మపై యుద్ధం స్టార్ట్ చేశారు.

Pawan Kalyan Fans Angry on Ram Gopal Varma Power Star Film:

Ram Gopal Varma Full Busy with Power Star Film Promotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs