Advertisement
Google Ads BL

పాయల్ ఘోష్ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందా..?


చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రయాణం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన భామ పాయల్ ఘోష్ ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఊసరవెల్లిలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించలేదు. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై వచ్చిన వార్తల ద్వారా మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పాయల్ ఘోష్ మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందట.

Advertisement
CJ Advs

బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ ఘోష్ ఒకానొక పాత్రలో నటించనుందని అంటున్నారు. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త అమ్మాయి నటించనుందని బోయపాటి స్పష్టం చేసాడు. ఇంకా టైటిల్ నిర్ణయింపబడని ఈ సినిమాకి మోనార్క్, సూపర్ మాన్ అనే టైటిళ్ళని పరిశీలిస్తున్నారు.

మరి ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పాయల్ ఘోష్ ఇందులో నటిస్తుందో లేదో చూడాలి. ఈ అవకాశం వస్తే గనక ఆమెకి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Payal ghosh again entry into Telugu film..?:

Payal Ghosh in Balayya movie..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs