Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ పెళ్లికి ప్రిపేర్ అవుతుందా?


కొంతమంది పెళ్లి అనగానే తెగ ఒత్తిడికి గురవుతూ హైరానా పడిపోతుంటారు. కానీ నాకు మాత్రం వివాహ బంధం అంటే అదో మధురమైన అనుభూతి అని చెబుతుంది రకుల్ ప్రీత్. ప్రస్తుతం అవకాశాలెలా ఉన్నా.. రకుల్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీనే. వర్కౌట్స్‌తోనూ, యోగా ఫొటోస్‌తోనూ అందరికి దగ్గరగా ఉండే రకుల్ ప్రీత్, ప్రస్తుతం బాలీవుడ్ లో కాస్త బిజీనే. అయితే రకుల్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో.. పెళ్లిపై తన అభిప్రాయం ఏమిటో చెబుతుంది. లవ్, వివాహ వ్యవస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. పెళ్లి అనేది ఓ అందమైన అనుభూతి అని చెప్పడమే కాదు... తనకు కాబోయే వరుడికుండాల్సిన లక్షణాలు గురించి ఏకరువు పెడుతుంది.

Advertisement
CJ Advs

నాకు కాబోయే వాడు నాకన్నా పొడవుగా ఉండాలి. నేను హై హీల్స్ వేసుకుని ఉన్నా.. నేను అతన్ని తలెత్తుకుని చూడాలి. అంత పొడవున్నవాడైతే ఇష్టమంటుంది. ఇంకా అతనికి చాలా తెలివితేటలుండాలని.. జీవితంలో ఏదైనా సాధించిన వాడైతే ఇంకా బావుంటుంది అని చెబుతుంది. ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది అని చెబుతుంది రకుల్. మరి రకుల్ కోరుకున్న వాడు ఎక్కుడున్నాడో.. ఎప్పుడొస్తాడో కానీ.. రకుల్ పెళ్లిపై కబుర్లు చెబుతుంది అంటే.. మెంటల్‌గా పెళ్ళికి ప్రిపేర్ అవుతుంది అనే అనుకోవాలేమో.

Rakul Preet Singh Wants This Type Of Husband:

Rakul Preet Singh wants these three qualities in her husband
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs