విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్‌ల పాన్ ఇండియా మూవీ 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాక.. కరోనా కారణంగా షూటింగ్ ఆపేసి ముంబై నుండి హైదరాబాద్‌కి వచ్చేసింది టీం మొత్తం. విజయ్ దేవరకొండ తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు. పూరి మాత్రం ఫైటర్ పనులు పక్కనపడేసి కొత్తగా జనగణమన స్క్రిప్ట్ ని మెరుగులు దిద్ది.. బాలీవుడ్ హీరోని లైన్‌లో పెట్టే పనిలో బిజీగా వున్నప్పుడు పూరి - విజయ్ సినిమా మళ్లీ ముంబై లో షూటింగ్ జరుపుకోవడం కుదరదు కాబట్టి.. ముంబై తో లింక్ అయ్యి ఉన్న కథలో మార్పులు చేర్పులు చేసి ఇక్కడే హైదరాబాద్‌లోనే సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారని వార్తలు రావడం.. ఇంతలో నిర్మాత ఛార్మి లైన్ లోకొచ్చి.. విజయ్ - పూరి స్క్రిప్ట్ లో మార్పులేమి చెయ్యడం లేదు. అది పక్కా స్క్రిప్ట్.. దాన్ని మార్చేది లేదు.. అదే స్క్రిప్ట్ తో సినిమా తెరకెక్కుతోందని కూడా ఛార్మి వివరణ ఇచ్చింది.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ కరోనా కారణంగా ముంబైకి రాలేనని.. ప్రస్తుతం హైదరాబాద్‌ని వదలడం సేఫ్ కాదని చెప్పడంతో.. పూరి చేసేది లేక అదే కథతో ముంబై సెట్ నే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో నిర్మించి షూట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అందుకే విజయ్ - పూరి రామోజీ ఫిలిం సిటీలో కొన్నాళ్ళు పాటు తిష్ట వెయ్యనున్నారని సోషల్ మీడియా న్యూస్. ఇప్పుడు ముంబైలో షూటింగులు చేసుకోలేక అక్కడ సినిమా వారు కూడా ఫిల్మ్‌సిటీకి పరిమితమవుతున్నారు. అందుకే రామోజీ ఫిల్మ్‌సిటీలో ముంబై సెట్ వేసి సినిమాని తీసెయ్యాలని పూరి అండ్ బ్యాచ్ రెడీ అవుతుందట. తాము అనుకున్న సెట్ నిర్మాణం పూర్తి కాగానే.. షూటింగ్‌కి బయలుదేరుతారని అంటున్నారు.