Advertisement
Google Ads BL

మహేష్ రికమెండ్ చేసిన వెబ్ సిరీస్..


సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు తన తర్వాతి చిత్రాన్ని గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అక్టోబర్ లేదా నవంబరులో చిత్రీకరణ మొదలు కానుందని సమాచారం.

Advertisement
CJ Advs

అయితే గత కొన్ని రోజులుగా షూటింగులు లేక ఇంట్లోనే గడుపుతున్న మహేష్, తన పిల్లలతో సరదాగా గడుపుతున్న క్షణాలని ఫోటోల రూపంలో అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు. అదీగాక కరోనా బారిన పడకుండా జాగ్రత్తలని వివరిస్తూ అప్రమత్తంగా ఉండమని చెప్పాడు. అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న డార్క్ అనే వెబ్ సిరీస్ ని చూడమని చెబుతున్నాడు.

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి బాగా పేరొచ్చింది. మహేష్ బాబు ఈ వెబ్ సిరీస్ ని పొగుడుతూ రైటింగ్ ని ఎగ్జిక్యూషన్ ని మెచ్చుకున్నాడు. అలాగే వెబ్ సిరీస్ చూడమని రికమెండ్ చేసాడు. ఇక మహేష్ నుండి ఈ మాట రావడమే ఆలస్యం, అభిమానులంతా అదే పనిలో పడ్డారు.

Mahesh recommended to watch web series..:

Mahesh recommended to watch web series..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs