Advertisement
Google Ads BL

హైపర్ ఆది అసలు విషయం చెప్పేశాడు!


జబర్దస్త్‌కి పోటీగా జీ తెలుగు యాజమాన్యం అదిరింది అనే కామెడీ షో ని నాగబాబు జడ్జ్‌గా స్టార్ట్ చేశారు. మొదటినుండి జబర్దస్త్‌కి పోటీగా దాన్నే టార్గెట్ చేస్తున్న అదిరింది మాత్రం అదరగొట్టలేక జబర్దస్త్ ముందు వెలవెలబోతుంది. జబర్దస్త్ మీద అలిగి అదిరింది షోకి నాగబాబు జడ్జ్ గా వెళ్లడమే కాదు... కొంతమంది కమెడియన్స్ ని తన వెంట తీసుకుపోయాడు. అప్పట్లో నాగబాబుకి సన్నిహితులైన సుడిగాలి సుధీర్, హైపర్ అది, అప్పారావు లాంటి వాళ్లు కూడా చమ్మక్ చంద్ర, ఆర్పీ, వేణు బాటలోనే అదిరిందికి వెళతారు అని ప్రచారం జరిగింది. కానీ.. ఆది, సుధీర్, అప్పారావులు జబర్దస్త్ ని వదల్లేదు. అప్పట్లో ఆది, సుధీర్, గెటప్ శ్రీను లాంటోళ్ళు నాగబాబు కి హ్యాండ్ ఇచ్చారనే టాక్ నడిచింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా హైపర్ ఆది అదిరింది షోకి ఎందుకు వెళ్లలేదో చెబుతున్నాడు. నాగబాబుగారితో కలిసి... ముందు వెళదామని అనుకున్నామని, జబర్దస్త్ లో చాలానే విషయాలు జరిగాయని, అవి మాత్రం బయట పెట్టలేనని, అదిరింది షో లో కొంతమంది వ్యక్తులు గురించి కొన్ని షాకింగ్ విషయాలు తనకి తెలిశాయని, అలా అని నాగబాబుగారితో తనకెలాంటి గ్యాప్ రాలేదని, నేను ఆ అదిరింది షోకి, అందులోని కొంతమందికి దూరం కానీ... నాగబాబుగారికి ఎప్పుడు దూరం కానని చెబుతున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్‌లో కూడా జరగకూడని విషయాలు జరిగాయని చెబుతున్న ఆది.. ఆ విషయాలేమిటో మాత్రం చెప్పకుండా దాటేశాడు. మరి ఆ విషయాలను నాగబాబుతో ఎప్పుడు చర్చిస్తానంటున్నాడు ఆది. మరి అన్ని విషయాలు తెలిసిన నాగబాబు మాత్రం అదిరింది షోకి ఎలా వెళుతున్నాడో ఆదికి, నాగబాబుకే తెలియాలి. 

Jabardasth Comedian Hyper Aadi reveals why he rejected Adirindi show:

Jabardasth Comedian Hyper Aadi Talks about Jabardasth and Adirindi shows
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs