Advertisement
Google Ads BL

ఆ వార్తలకి చెక్ పెట్టడానికి ఆయనే రంగంలోకి దిగాడు..


తెలుగు సినిమా గేయరచయితల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రచయిత.. సుద్దాల అశోక్ తేజ. ఒసేయ్ రాములమ్మా సినిమాలో ఏడు పాటలు రాసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాలోని నేను సైతం అనే పాటకి జాతీయ అవార్డుని అందుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సుద్దాల అశోక్ తేజ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది.

Advertisement
CJ Advs

అశోక్ తేజ గారి ఆరోగ్యం బాగాలేదంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలు నిజమేనని, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారని స్వయంగా సుద్దాల అశోక్ తేజగారి బంధువులే తెలియజేసారు. అయితే తాజాగా సుద్దాల గారిపై మళ్లీ రూమర్లు ఊపందుకున్నాయి.

ఆయన చేయించుకున్న లివర్ ప్లాంటేషన్ సర్జరీ విజయవంతం అవ్వలేదని, అందువల్ల మళ్లీ హాస్పిటల్ చేరాడని అన్నారు. అయితే ఆ వార్తలని ఖండించిన సుద్దాల అశోక్ తేజ ఈ సారి ఏకంగా వీడియోతో వచ్చాడు. తన ఆరోగ్యం బాగానే ఉందని, సర్జరీ విజయవంతం అయిందని, ఎలాంటి సమస్యా లేదని, పాటలు కూడా రాస్తున్నాననీ తెలిపారు. మొత్తానికి ఈ వీడియోతో సుద్దాల అశోక్ తేజ గారిపై వచ్చిన అనేక పుకార్లకి చెక్ పడినట్టే. 

Suddala Ashok Teja condemned those rumours..:

Suddala Ashok Teja condemned those rumours..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs