Advertisement
Google Ads BL

‘పుష్ప’ టీమ్ ప్లానింగ్.. మాములుగా లేదు..!


ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై బాగా కనబడుతుంది. సినిమా షూటింగ్స్ అంటే వందల మంది సెట్స్ లో ఉండాలి. పరిమితి లేని జనాల మధ్యన షూటింగ్ జరుగుతుంది. 30..  50 మందితో కరోనా లాక్డౌన్ ఆంక్షలు పాటిస్తూ షూటింగ్ చెయ్యలేక రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ చేతులెత్తేశాడు. అయితే చాలామంది హీరోలు కరోనా భయంతో సెట్స్ మీదకి వెళ్లడం లేదు.. కొంతమంది రెడీ అవుతుంటే...  సీరియల్స్ షూటింగ్ లో కరోనా పాజిటివ్ ల వలన సినిమా షూటింగ్స్ వెనక్కి వెళ్లిపోయేలా ఉన్నాయి. అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న పుష్ప సినిమా టీం మాత్రం షూటింగ్ చేసుకునేందుకు ఓ అద్భుతమైన ప్లాన్ చేసినట్టుగా ఫిల్మ్‌నగర్ టాక్. నిన్నటివరకు పుష్ప టీం షూటింగ్ కోసం అడవుల సెట్ వేసుకోవాలి, అడవుల్లో షూట్ చెయ్యడానికి కరోనా వల్ల కుదరదు కాబట్టి.. సెట్ వేసుకోవడమే గతి అన్నారు. అయితే కరోనా టైం లోనే పుష్ప తీరం అడవుల్లో షూటింగ్ చెయ్యడానికి రెడీ అవుతుందట.

Advertisement
CJ Advs

అది కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టుగా 30.. 40 మందితో కాదు.. ఏకంగా 200మందితో. హైద‌రాబాద్ శివార్ల‌లోని అట‌వీ ప్రాంతంలో పుష్ప షూటింగ్ చేయ‌డానికి సుకుమార్ టీమ్ రెడీ అవుతుందట. అక్కడ రిసార్ట్ ని అద్దెకి తీసుకుని..... అందరికి సపరేట్ గదులు కేటాయిస్తూ సామాజిక దూరం పాటిస్తూ.. నటీనటులకు, సాంకేతిక నిపుణులకి అద‌న‌పు సౌకర్యాలు క‌ల్పించి... అక్కడ ఒకసారి లోప‌ల‌కి వెళ్లిన వాళ్లు, బ‌య‌ట‌కు.. బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లు లోపల‌కు రానివ్వ‌కుండా కరోనా ఆంక్షలతో క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్ల మ‌ధ్య షూటింగ్ చేసుకోవ‌డానికి పుష్ప టీం ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్. అంతేకాదు.. అక్కడే రిసార్ట్స్ లోనే వంట వార్పు అన్నీ అక్కడేనట. అక్కడ వంట తప్ప బయట ఫుడ్స్ కూడా సెట్స్ లోపలి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. సెట్స్ లోకి వచ్చేవారు కరోనా పరీక్షలు చేశాకే అనుమతిచ్చి.. తర్వాత బయటికి వచ్చే అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యన పుష్ప టీం భారీగా రంగంలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. 

Excellent Planning to Pushpa Team for Shooting :

Pushpa Movie Team Takes Sensational Decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs