Advertisement
Google Ads BL

నేను విలన్‌గానా..? అప్పుడే చెయ్య: మనోజ్!


మంచు వారబ్బాయి.. మోహన్‌బాబు కొడుకు మంచు మనోజ్ భారీ గ్యాప్ తీసుకుని మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ ఇండియా లెవల్లో హీరోగా చెయ్యడమే కాదు... ఆ సినిమాకి నిర్మాతగా మారాడు. హీరో అయినా దగ్గరనుండి ఒడిదుడుకుల్లో ఉన్న కెరీర్‌కి మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిల్మ్‌తో వెన్న రాయాలని చూస్తున్నాడు. అయితే తాజాగా మంచు మనోజ్ విలనవతారం అది కూడా తన ఫ్రెండ్ ఎన్టీఆర్ మూవీలో అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు మోహన్ బాబు విలనిజంలో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. ఇప్పుడు మనోజ్ కూడా ఎన్టీఆర్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తండ్రి మోహన్ బాబు మాదిరి ఓ ఊపు ఊపడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో మనోజ్ స్టైలిష్ విలన్ గా చేయబోతున్నాడని అన్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మనోజ్ తానూ ఎన్టీఆర్ సినిమాలో విలన్ పాత్ర చెయ్యడంపై క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకి ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చెయ్యడమే కాదు.... అయితే తాను విలన్ క్యారెక్టర్లు చేయడానికి వ్యతిరేకం కాదని... కాకపోతే... ఇప్పటికిప్పుడే విలన్ క్యారెక్టర్లు చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. అంటే ఫ్యూచర్ లో చేసే ఆలోచన ఉంది.. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదని స్పష్టత ఇచ్చాడు మనోజ్. మరి ఎన్టీఆర్‌తో తనకున్న స్నేహం వలనే ఇలాంటి పుకార్లకు కారణమై ఉండొచ్చు అంటున్నాడు మంచు వారి కుర్రాడు. 

Manchu Manoj Condemned the Villain Rumors :

Manchu Manoj Clarity on Villain Role in Jr NTR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs