Advertisement
Google Ads BL

ప్ర‌భాస్ 20‌ మూవీ అప్‌డేట్ రాబోతోంది


జూలై 10, ఉద‌యం 10 గంటల‌కు యూవీ క్రియేష‌న్స్ - గోపీకృష్ణ మూవీస్, ప్ర‌భాస్ 20‌ మూవీ అప్‌డేట్

Advertisement
CJ Advs

బాహుబలి, సాహో వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తరువాత వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ 20 పై పాన్ ఇండియా వైడ్ భారీగా అంచ‌నాలు ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. గోపికృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థతో అనుబంధంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. 

ఇప్ప‌టికే కీల‌క స‌న్నివేశాలుకి సంబంధించిన షూటింగ్ ని ముగించిన‌ట్లుగా చిత్ర బృందం చెబుతోంది. కోవిడ్ 19 క్రైసిస్ ముగిసిన వెంట‌నే ఈ సినిమాకి సంబంధించి మిగిలి ఉన్న షూట్ పోర్ష‌న్ కంప్లీట్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్ర‌మోద్, వంశీ, విక్ర‌మ్ లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్ర‌భాస్ 20 కి సంబంధించిన కీల‌కమైన అధికారిక ప్ర‌క‌ట‌నను జూలై10న ఉద‌యం 10 గంటల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో తొలిసారిగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో న‌టిస్తోంది. ప్ర‌ముఖ విఎఫ్ఎక్స్ టెక్నీషియ‌న్క క‌మల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం. 

నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

సమర్పణ: గోపీకృష్ణ మూవీస్ - కృష్ణం రాజు

బ్యానర్: యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: ప్రమోద్, వంశీ

దర్శకుడు: కే కే రాధాకృష్ణ కుమార్

Prabhas 20 Update Details:

<strong><span style="color: #660000;">First look poster of Prabhas20 - Produced by UV Creations and Gopikrishna Movies, to be out on July 10th at 10AM</span></strong>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs