Advertisement
Google Ads BL

జీతాల కోత.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు తప్పట్లేదు!


ప్రస్తుతం కరోనా దెబ్బకి ఏ ఇండస్ట్రీ అయినా, ఏ కంపెనీ అయినా చేతులెత్తెయ్యడం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది. చిన్న, మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. చెయ్యడానికి పని లేదు తినడానికి తిండి లేదు. ఇది కరోనా కాల పరిస్థితి. ఉన్న ఉద్యోగాలకు కోతలతో జీతాలు. 50 వచ్చేదగ్గర 20తో సరిపెట్టుకోవాలి. 20 వచ్చేదగ్గర 5 తోనే సరిపెట్టాలి... అలా ఉంది పరిస్థితి. ఇక చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతా లాక్‌డౌన్ మహిమ. కొన్ని కంపెనీస్ జీతాలివ్వలేక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అలానే ఉంది. సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ లేక చిన్న చిన్న ఆర్టిస్ట్‌లు ఇబ్బందులు పడుతుంటే.... సిసిసి కాస్తంత సాయం అందుతుంది అంతే. ఇక సినిమా అంటే 24 క్రాఫ్ట్స్. లైట్ మ్యాన్ దగ్గరనుండి.. అందరూ జీతాల మీద ఆధారపడేవారు. ఇక నిర్మాతలు సినిమాలు విడుదల కాక నానా తంటాలు పడుతున్నారు.
పది, ఐదు రూపాయల వడ్డీలకు తెచ్చి బడా సినిమాలు నిర్మించే బడా నిర్మాతలు ఇప్పుడు ఆ వడ్డీలు కట్టలేక తెగ మధనపడుతున్నారు. ఇక అందుకే సినిమా షూటింగ్ లు ఆగిన దగ్గరనుంచి తమ తమ స్టాఫ్‌కి జీతాలు ఆపేసారు. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డివివి దానయ్య మాత్రం ఆర్ఆర్ఆర్ టెక్నీకల్ సిబ్బందికి జీతాలు ఆపలేదు. మరోపక్క సుకుమార్ పుష్ప సినిమా స్టాఫ్‌కి యధావిధిగా జీతాలు ఇచ్చేస్తున్నారట. ఎలాగో ఈ కరోనా రెండు మూడు నెలలో సద్దుమణిగి షూటింగ్స్ మొదలవుతాయని ఆర్ఆర్ఆర్ నిర్మాత అనుకున్నాడు. కానీ ఇది మరో రెండు నెలలు కంటిన్యు అయ్యేలా కనిపించడంతో... ఇప్పుడు ఆర్ఆర్ఆర్ స్టాఫ్‌కి జీతాలు ఆపేశారని టాక్. ఇక షూటింగ్ మొదలయ్యేవరకు జీతాలు ఇవ్వలేమని నిర్మాత చేతులెత్తేశాడట. మరి లాక్‌డౌన్ లోను ఉద్యోగులకు, కార్మికులకు ఇప్పటివరకు జీతాలిచ్చి.. ఇప్పడు ఆపెయ్యడం కాస్త బాధాకర విషయమే అయినా.. ఇప్పటివరకు జీతాలు ఇచ్చుకుంటూ రావడం గ్రేట్ అంటున్నారు.

Advertisement
CJ Advs

Salaries Cuttings to RRR Movie Team:

RRR Producer Takes Sensational Decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs