Advertisement
Google Ads BL

భీమవరం టాకీస్ ATT రెడీ అవుతోంది..!


లాక్‌‌డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడినప్పుడు, గ్రేట్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ATT అంటే ఎనీ టైం థియేటర్ అని అర్జీవి కొత్త విధానానికి నాంది పలికారు. ఆ బాటలోనే భీమవరం టాకీస్ ATT అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. మొట్టమొదటి సినిమాగా థియేటర్స్ దొరకక ఇబ్బంది పడుతున్న సినిమాలను విడుదల కానున్నాయి. సుమారుగా డిసెంబర్ వరకు థియేటర్స్ ఓపెన్ కాకపోవచ్చు. ఓపెన్ అయినా చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్‌కి రాక పోవచ్చు ఈ ఆలోచన లోనే రాంగోపాల్ వర్మ ద్వారా పుట్టిన ఈ ఐడియాను అమలు పరుస్తున్నట్లు నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.
యువతను ఆకట్టుకునే అంశాలతో వస్తున్న మొట్ట మొదటగా థియేటర్స్ లో విడుదల కాకుండా ఓన్లీ ఈ ATT ద్వారా విడుదల అవుతున్న సినిమాగా నిలిచిపోయే సినిమా ‘అమ్ముడు కుమ్ముడు’. తదుపరి భారీ బడ్జెట్‌తో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ స్పాట్, తదుపరి అగ్లీ, శివ 143, థి గ్రేట్ గ్యాంబ్లర్ ఇంకా అనేక సినిమాలు విడుదల కానున్నాయి. దాదాపు 90 పైగా అద్భుతమైన సినిమాలు ఈ ATT లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. టికెట్ ధర రూ. 59. ఒకే టికెట్ పై కుటుంబం అంతా చూడవచ్చు. ప్రతి వారం 2 సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీరు డౌన్ లోడ్ చేసుకునే విధానం, క్రోమ్ లోకి వెళ్లి భీమవరం టాకీస్ డాట్ కామ్ అనే టైప్ చేసి.. మీకు నచ్చిన ఆప్షన్ లో సినిమా చూడండని భీమవరం టాకీస్ రామ సత్యనారాయణ తెలిపారు.

Advertisement
CJ Advs

Bheemavaram Talkies ATT Ready for Movies:

producer Rama Satyanarayana talks about Bheemavaram Talkies ATT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs