కరోనా టైమ్ లో సినిమా పరిశ్రమ అన్ని షూటింగులని క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోనే కూర్చుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం లాక్డౌన్ టైమ్ లోనూ షూటింగ్ చేసాడు. కరోనా వైరస్ పై చిత్రాన్ని లాక్డౌన్ టైమ్ లో చిత్రీకరించి అందరినీ షాక్ కి గురిచేసాడు. అయితే కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు కూడా ఎక్కువవుతున్నాయి. సీరియల్ నటీనటుల్లో రోజుకొక్కరు కరోనా బారిన పడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పుకార్లు మరింత పెరుగుతున్నాయి.
తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీమ్ లో ఒకరికి కరోనా వచ్చిందన్న ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలని ఖండించిన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. తన టీమ్ లో కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలు అవాస్తవమని, టెస్టులు పూర్తయిన తర్వాతే షూటింగ్ కి వెళ్తున్నామని, ప్రభుత్వం సూచించిన అన్ని సూచనలని పాటిస్తున్నామని తెలియజేసాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఏటీటీ( ఎనీ టైమ్ థియేటర్) పేరుతో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో తన సినిమాలని పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.