Advertisement
Google Ads BL

కీర్తిసురేష్, సమంత.. ఇప్పుడు రష్మిక..!!


ప్రస్తుతం సమంత సినిమాలేవీ ఒప్పుకోకుండా దర్శకనిర్మాతలు తిప్పుకుంటుంది అని.. తెలుగు, తమిళ సినిమాలను పక్కనబెట్టి.. బాలీవుడ్ కి చెక్కేసే ప్లాన్స్ చేస్తుంది అనే ప్రచారం ఉంది. అయితే తాజాగా సమంత ఉంటేనే మన ప్రాజెక్ట్ అంటూ విక్రమ్ కుమార్... నాగ చైతన్య తో చేసే ప్రాజెక్ట్ విషయంలో కండిషన్ పెట్టినట్లుగా సోషల్ మీడియా టాక్. విక్రమ్ కుమార్ నాగ చైతన్యతో చెయ్యబోయే సినిమాలో సమంత హీరోయిన్ అయితే మంచి క్రేజ్ వస్తుంది అని భావిస్తున్నట్టుగా టాక్ ఉంది. అయితే ఇప్పుడు సమంతని అసలు అడగలేదని.. సమంతని అనుకుంటున్నారు అనే దానిలో వాస్తవం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు చైతు పక్కన నటించేందుకు కీర్తి సురేష్ ని సంప్రదిస్తున్నారని.. కాకపోతే కీర్తి సురేష్ ఈమధ్యన బాగా చిక్కి తయారవడంతో.. ఆమె చైతు పక్కన తేలిపోతుంది అనే ఉద్దేశ్యంతో మరో భామని అనుకుంటున్నట్లుగా ఫిల్మ్‌నగర్ టాక్.

Advertisement
CJ Advs

గతంలో పరశురామ్‌తో చైతు మూవీ అనుకున్నప్పుడు హీరోయిన్ గా రష్మిక పేరు వినబడింది. ఇప్పుడు కీర్తి సురేష్ మరీ సన్నగా ఉంది ఎందుకులే.. రష్మికాని తీసుకుందామా అనే ఆలోచనలో విక్రమ్ కుమార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక చైతు సినిమా కోసం థ్యాంక్ యు అనే  టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే పుష్ప సినిమాతోనూ, కన్నడ సినిమాల్తోనూ బిజీగా ఉన్న రష్మిక డేట్స్ కుదురుతాయా లేదా అనేది ఇప్పుడు చైతు - విక్రమ్ కుమార్ ముందున్న సమస్యగా చెబుతున్నారు. 

Who is Chaitu and Vikram Kumar Film Heroine?:

Boll in Rashmika Court.. Chitu and Vikram kumar Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs