Advertisement
Google Ads BL

థమన్ వదిలిన ‘IPC 376’ మూవీ ట్రైలర్!


థమన్ చేతుల మీదుగా నందిత శ్వేతా నటించిన ‘IPC 376’ మూవీ ట్రైలర్ విడుదల

Advertisement
CJ Advs

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం IPC 376. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ను సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశారు. 

ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతాయి. ఆధునిక యుగంలో సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటూ చెబుతూనే, అటు అతీంద్రియ శక్తుల ఉనికిని విజువల్స్ లో చూపించారు. రేప్ చేస్తారు, ప్రాణాలతో తగలబెడతారు, అమ్మాయిలను బతకనివ్వరా అంటూ నందిత శ్వేతా చెప్పిన ఎమోషనల్ పవర్ ఫుల్ డైలాగ్ తో ఐపీసీ 376 ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. ట్రైలర్ లోని వివిధ ఇంట్రెస్టింగ్ షాట్స్ చిత్ర కథ గత థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో ఉందని తెలుపుతున్నాయి. 

పోలీస్ అధికారి పాత్రలో నందిత శ్వేత ఫుల్ స్వింగ్ లో నటించిందని ట్రైలర్ చూపిస్తోంది. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సి.కళాధర్ సాహిత్యం అందిస్తున్నారు. తెలుగు మరియు తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.

Click Here for Trailer 

SS Thaman Launches IPC 376 Movie Trailer:

IPC 376 Movie Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs