నవీన్ చంద్ర హీరోగా సలోని లుత్రా హీరోయిన్ గా తెరకెక్కిన భానుమతి రామక్రిష్ణ చిత్రం రేపటి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవనున్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అనుకోని ఆటంకం ఎదురైంది. సాధారణంగా రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో పెద్దగా వివాదాస్పద అంశాలేమీ ఉండవు. కానీ ఈ సినిమాకి టైటిల్ వల్లనే వివాదం చెలరేగింది.
అలనాటి హీరోయిన్ భానుమతి రామక్రిష్ణ గారి పేరుని వాడుకున్నారంటూ భానుమతి గారి కుమారుడు చెన్నై కోర్టులో పిటిషన్ వేసాడు. దాంతో కోర్టు ఈ సినిమా పేరుని మార్చాలంటూ ఆదేశాలు జారీ చేసిందట. అయితే ప్రస్తుతం ఈ సినిమా పేరుని భానుమతి రామక్రిష్ణ కి బదులుగా భానుమతి అండ్ రామక్రిష్ణగా మార్చనున్నారని తెలిసింది. రేపు రిలీజ్ కాబోయే చిత్రానికి ఈరోజు పేరు మార్చడం కొంచెం వింతగా అనిపించినా తెలుగు చిత్రపరిశ్రమలో ఇలా చాలా సార్లు జరిగింది.