Advertisement
Google Ads BL

విలన్‌గా అయినా రెడీ: అక్కినేని ఫ్యామిలీ హీరో!


అక్కినేని హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ మొదట్లో వరస సినిమాలు చేసి తర్వాత భారీ గ్యాప్ తీసుకుని చి ల సౌ తో హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసిన సుశాంత్ ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. అయితే అన్ని సినిమాల వలే ఈ సినిమా కూడా కరోనా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన సుశాంత్ చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తనకి కథ బాగా నచ్చితే విలన్ రోల్స్ చేయడమైనా ఇష్టమే అని చెప్పి షాకిచ్చాడు. కథలో బలం ఉంటే.. విలన్ రోల్స్ అయినా ఒకే అంటున్నాడు ఈ అక్కినేని హీరో.

Advertisement
CJ Advs

లాక్‌డౌన్‌తో ఇంట్లోనే గడుపుతున్న సుశాంత్ సినిమా షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాడట. ఇక తన బావ నాగచైతన్య - సమంతలు చాలా క్రమ శిక్షణతో ఉంటారట. అలాగే తాను వాళ్ళలా ఉండడానికి ట్రై చేస్తున్న అంటున్నాడు. మరి చైతు - సమంత లు సపరేట్ గా ఇల్లు తీసుకుని ఉంటున్నారు. అక్కినేని ఫ్యామిలీతో కలిసి లేకపోయినా.. వారానికి ఒకసారి అందరూ కలిసి భోజనం చేస్తుంటామని ఒకానొక సందర్భంలో నాగార్జున చెప్పాడు. మరి చైతు - సామ్‌ల నుండి అక్కినేని హీరో సుశాంత్ క్రమ శిక్షణ నేర్చుకుంటున్నాడన్నమాట.

Ready to Play Villain roles says Sushanth:

<span>Sushanth Chit Chat Highlights</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs