Advertisement
Google Ads BL

‘A’ టీజర్‌కు విశేష స్పందన..!


సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘A’. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ల విడుదలతో ప్రేక్షకుల అంచనాలను పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తే ఖచ్చితంగా ఈ చిత్రం సినిమా ప్రియులకు ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది.

Advertisement
CJ Advs

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను 5 లక్షల మంది వీక్షించారు ఇంకా ప్రేక్షకులు టీజర్‌ను చూస్తూనే ఉన్నారు. ఒక చిన్న సినిమాకు ఇంత భారీగా ఆదరణ రావడం విశేషం. డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారనే దానికి ‘A’ (AD ‌INFINITUM) టీజర్ బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యుగంధర్ ముని ఎంచుకున్న డిఫరెంట్ పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది. త్వరలో ఈ చిత్ర ఆడియో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. A (AD ‌INFINITUM) చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనున్నారు.

సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ అండ్ మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల, చిత్రంలోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ వ్రాయగా దీపు మరియూ పావని ఆలపించారు. తన తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలను పోషించడం విశేషం.

Tremendous Response to A Movie Teaser:

5 lakh viewers to A Ad Infinitum Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs