Advertisement
Google Ads BL

ఓటీటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన బాలీవుడ్ హీరోలు..


థియేటర్లు ఇప్పట్లోఓ తెరుచుకుంటాయన్న నమ్మకం లేకపోవడంతో సినిమాలన్న్నీ ఓటీటీ బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోని ఏడు చిత్రాలు డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ మేరకు డిస్నీ హాట్ స్టార్ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్, అజయ్ దేవగణ్ భుజ్, ఆలియా భట్ సడక్2, అభిషేక్ బచ్చన్ బిగ్ బుల్, సుశాంత్ దిల్ బేచరా..

Advertisement
CJ Advs

వీటితో పాటు విద్యుత్ జమాల్ ఖుదా హఫీజ్, కునాల్ ఖేము లూట్ కేస్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడు సినిమాలు స్ట్రీమింగ్ అవనున్న నేపథ్యంలో ఈ సినిమాల్లోని ముఖ్య పాత్రదారులతో లైవ్ ఇంటారాక్షన్ ని ప్లాన్ చేసిన డిస్నీ హాట్ స్టార్, ఆ ప్రోగ్రామ్ కి విద్యుత్ జమాల్, కునాల్ ఖేములని ఆహ్వానించడం మరిచింది. వీరిద్దరు మినహా ఐదుగురితో మాత్రమే ఈ కాన్ఫరెన్స్ ముగిసింది. 

అయితే వెబ్ కాన్ఫరెన్స్ కి తమని ఆహ్వానించకపోవడంపై విద్యుత్ జమాల్, కునాల్ ఖేము డిస్నీ హాట్ స్టార్ పై వ్యంగ్యాస్త్రాలని సంధించారు. విద్యుత్ ట్వీట్ చేస్తూ, ఏడు సినిమాలు స్ట్రీమింగ్ కి షెడ్యూల్ అయినా అందులో ఐదు చిత్రాలకి మాత్రమే సరైన ప్రాతినిధ్యం లభించింది. మిగిలిన వారికి ఆహ్వానమే కాదు సమాచారం కూడా లేదు.. అంటూ తనదైన శైలిలో సెటైర్ వేసాడు.

ఇక కునాల్ చేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది..  నన్ను విస్మరించడం నన్నేమీ చిన్నదిగా చేయదు. అందరికీ ఒకే ప్లేగ్రౌండ్ ఇస్తే అంతకన్నా ఎక్కువ ఎత్తుకి చేరుకుని చూపిస్తాం అంటూ ట్వీట్ చేసాడు.

Bollywood actors satire on OTT platform..:

Bollywood actors satire on OTT platform..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs