Advertisement
Google Ads BL

అయ్యబాబోయ్.. సమంతను చూశారా?


నిన్నమొన్నటివరకు అక్కినేని కోడలు సమంత అక్కినేని కూడా కరోనా బారిన పడింది అంటూ వార్తలొచ్చాయి. ఆమె బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో సమంతకి కూడా కరోనా వచ్చేసింది అని అనుకున్నారు. కానీ సమంత తనకి కరోనా లేదనిగాని, ఉందని కానీ చెప్పలేదు. అలాగే శిల్పారెడ్డి హోమ్ క్వారంటైన్ లోనే ఉండి కరోనాని జయించింది. తనకి నెగెటివ్ వచ్చింది అని.. తాను సేఫ్ అని కరోనా వలన భయపడ వద్దని చెప్పింది. అయితే సమంత మాత్రం కరోనా విషయాలేమి మాట్లాడకుండా తన ఆపనిలో తాను బిజీగా వుంది. టెర్రస్ పై ఆకు కూరలు, కూరగాయలు పండించడమే కాదు... వర్కౌట్స్ తోనూ బాగా బిజీగా ఉంటుంది.

Advertisement
CJ Advs

ఈమధ్యన సమంత జిమ్‌లో వర్కౌట్స్ కన్నా యోగాసనాలతో కొవ్వు కరిగిస్తుంది. యోగా చేస్తే బాడీ చాలా తేలికగా ఉంటుంది.. యోగాతో ఆరోగ్యం వస్తుంది అంటూ యోగాని ప్రమోట్ చెయ్యడమే కాదు.. యోగాసనాలతో సోషల్ మీడియాని ఊపేస్తోంది. మొన్నటికి మొన్న బ్రీతింగ్ యోగాసనం చేసి చూపించిన సమంత.. మొన్న రెండు చేతులని కింద పెట్టి.. బాడీ మొత్తం గాల్లోకి లేపి వేసిన యోగాసనంతో హైలెట్ అయ్యింది. తాజాగా సమంత రెండు కాళ్లను పైకి పెట్టి... తల కిందకి పెట్టి గాల్లో వేలాడుతున్న యోగాసనం ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత హాట్‌గా యోగా డ్రెస్‌లో అలా తల్లకిందులుగా చేస్తున్న యోగా పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Samantha Yoga pic goes viral in social media:

Pic Tak: Samantha Stunning Yoga Pose
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs