కరోనా లాక్ డౌన్ తో బుల్లితెర షోస్ మొత్తం ఆగిపోయాయి. బుల్లితెర ప్రేక్షకులు పరమ బోర్ ఫీలయ్యారు. ఈటివిలో అయితే... జబర్దస్త్ పాత ఎపిసోడ్స్ ని ప్రసారం చేస్తుంది. కానీ బుల్లితెర ప్రేక్షకులు కొత్త కొత్త పంచ్ లకు అలవాటుపడి... పాత ఎపిసోడ్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మూడు నెలల తర్వాత ప్రభుత్వ అనుమతులతో బుల్లితెర షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాయి. దానితో జబర్దస్త్ షూటింగ్, జీ తెలుగు కామెడీ షో అదిరింది షో అన్ని మొదలయ్యాయి. తాజాగా జబర్దస్త్ షోస్ అయితే బుల్లితెర మీద సందడి చేస్తున్నాయి కూడా. గురువారం, శుక్రవారం కరోనా కొత్త ఎపిసోడ్స్ తో ఈటివి టిఆర్పీ రేటింగ్స్ ఎక్కడికో వెళ్లేలా ఉంది. జబర్దస్త్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ లో కొత్త కొత్త స్కిట్స్, కొత్త టీమ్స్ తో జబర్దస్త్ అదరగొట్టేస్తుంది. అయితే మొదటి నుండి జబర్దస్త్ ని టార్గెట్ చేసి.. బుల్లితెర మీద ఓ వెలుగు వెలుగుదామనుకున్న జీ తెలుగు అదిరింది కామెడీ షో.. మొదటి నుండి బుల్లితెర మీద జబర్దస్త్ కి పోటిగానే ఫీలయ్యారు.
కానీ జబర్దస్త్ ముందు అదిరింది షో వెలవెల బోతూనే ఉంది. కరోనా లాక్ డౌన్ తో అన్ని షోస్ లాగే అదిరింది షో కూడా ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు కొత్త ఎపిసోడ్స్ తో ఈ ఆదివారం అదిరింది షో సందడి చెయ్యడానికి రెడీగా ఉంది. నాగబాబు, నవదీప్ జడ్జ్ లుగా తెరకెక్కిన అదిరింది షో కొత్త ఎపిసోడ్ తో అయినా జబర్దస్త్ ని బీట్ చేస్తుందేమో చూడాలి. మూడు నెలల గ్యాప్ తో జబర్దస్త్ కమెడియన్స్ నూతన ఉత్సాహంతో తమ స్కిట్స్ కి అదిరిపోయే పంచెస్ రాసుకుని స్టేజ్ మీద కామెడీ పండించారు. మరి అదిరింది ఎప్పటిలాగే చప్పగా ఉంటుందా? లేదంటే కరోనా లాక్ డౌన్ తో కొత్తగా ఏమన్నా చేంజ్ అయ్యిందా అనేది మాత్రం ఆదివారం ప్రారంభం కాబోయే కొత్త ఎపిసోడ్ తో ఓ క్లారిటీ వస్తుంది.