Advertisement
Google Ads BL

ఒకే రోజు రెండు టీజర్లు.. ఒకటి అలా.. ఇంకోటి ఇలా..


అల్లరి నరేష్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన కొత్త చిత్రాలైన రెండు సినిమాల నుండి టీజర్లని రిలీజ్ చేసారు. సాధారణంగా హీరో పుట్టినరోజుకి ఒకే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి. కానీ అల్లరి నరేష్, అభిమానులకి డబుల్ ట్రీట్ ఇస్తూ రెండు సినిమాలకి సంబంధించిన టీజర్లతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ రెండు చిత్రాల టీజర్లు ఒకదానికొకటి  డిఫరెంట్ గా ఉన్నాయి. 

Advertisement
CJ Advs

నరేష్ సినిమా అనగానే గుర్తొచ్చే కామెడీ చిత్రంగా బంగారు బుల్లోడు కనిపిస్తుంటే, నేను..విశాఖ ఎక్స్ ప్రెస్..  సినిమాల్లో కనిపించే సీరియస్ నెస్ నాందిలో కనిపించింది.   ఇక్కడ ముఖ్యంగా నాంది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీజర్ లో అల్లరి నరేష్ పోలీస్ కస్టడీలో ఎన్ని బాధలు అనుభవించాడో చూపించారు. టీజర్ ప్రకారం న్యాయవ్యవస్థలోని లోపాలని ఎత్తిచూపిస్తున్నట్లుగా ఉంది. సినిమాలో ఉన్న మిగతా నటులకి కూడా సీరియస్ పాత్రలే దక్కినట్లుగా ఉంది. 

అయితే బంగారు బుల్లోడు చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుందని అంటున్నారు. కానీ నాంది మాత్రం థియేటర్ కోసమే అని చెబుతున్నారు. మొత్తానికి ఒకే రోజున రెండు సినిమాల టీజర్లతో అభిమానులని అలరించిన అల్లరి నరేష్, సినిమాల ద్వారా కూడా అంతే ఆనందాన్ని పంచుతాడేమో చూడాలి. 

One day two teasers.. Naresh double treat..:

One day two teasers.. Naresh double treat..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs