Advertisement
Google Ads BL

ప్రభాస్ ధైర్యం చేస్తున్నా.. ఇంకో నెల తప్పదు!


ప్రస్తుతం కరోనా వలన స్టార్ హీరోలెవరు షూటింగ్స్‌కి రావడానికి సిద్ధపడట్లేదు. కరోనా మహమ్మారి తగ్గాకే సెట్స్ మీదకి అన్నట్టుగా ఉంది వారి వ్యవహారం. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటోళ్ళు అయితే కరోనా తగ్గాలి.. సెట్స్ మీదాకెళ్ళాలే అన్నట్టుగా ఉన్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవడం లేదు. కరోనా ముందే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియా కొచ్చిన ప్రభాస్ లాక్‌డౌన్ ఎప్పుడెప్పుడు ముగిసి షూటింగ్స్ చేద్దామా అన్నట్టుగా ఉన్నాడనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

కానీ ప్రభాస్ షూటింగ్ మొదలెడదామన్నా ఇప్పుడు అది కుదిరేలా లేదు. ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యాం సినిమాలోని చాలా భాగం విదేశాల్లోనే షూట్ చెయ్యాల్సి ఉంది. కానీ ప్రస్తుతం విదేశాల షూటింగ్ అయ్యే పని కాదు. అందుకే ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా కోసం ఇక్కడే ఓ స్టూడియోలో ప్రత్యేకమైన ఓ స్ట్రీట్ సెట్‌, షిప్‌, హాస్పిట‌ల్ సెట్ల‌ని నిర్మించబోతున్నారట. అయితే ఆ సెట్స్ నిర్మాణం పూర్తి కావడానికి మరో నెల ఖచ్చితంగా పడుతుందట. అంటే జులై వెళ్ళాక ఆగష్టు నుండి ప్రభాస్ రాధే శ్యాం షూటింగ్ మొదలవుతుంది అన్నమాట. మరి కరోనా మహమ్మారి వదిలిపోతే.. ఎప్పటిలాగే సెట్స్ మొత్తం షూటింగ్స్ తో కళకళలాడతాయి. మరి ప్రభాస్ ఫాన్స్ కూడా ప్రభాస్ సినిమా లుక్ కోసం ఎప్పటినుండో కాచుకుని కూర్చున్నారు. మరి షూటింగ్ మొదలైతే కానీ... ప్రభాస్ సినిమా లుక్ కానీ, టైటిల్ కానీ బయటికి రాదు.

Prabhas waiting for His Latest Film Shooting:

Prabhas Ready but Corona not Cool 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs