Advertisement
Google Ads BL

‘అమృతం ద్వితీయం’.. 6,7,8 వెబిసోడ్స్‌ సిద్ధం!


‘జీ 5’లో సరికొత్త వినోదామృతం... 

Advertisement
CJ Advs

సంతోషానికి దివ్యఔషధం వినోదామృతం అని పెద్దలు చెబుతుంటారు. తెలుగు ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని అందించిన బుల్లితెర కార్యక్రమం ‘అమృతం’. పదమూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు ముందుకు ‘అమృతం’ తీసుకొచ్చిన ఘనత ‘జీ 5’ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌ది. వందకు పైగా ఒరిజినల్‌ షోలు, సిరీస్‌లతో దేశవ్యాప్తంగా అన్ని భాషల వీక్షకులనూ ఆకట్టుకుంటూ... ఒరిజినల్‌ కంటెంట్‌తో దూసుకువెళ్తున్న ‘జీ 5’లో ‘అమృతం ద్వితీయం’ వెబిసోడ్స్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌ 25న ‘అమృతం ద్వితీయం’లో మూడు కొత్త ఎపిసోడ్స్‌ యాడ్‌ చేశారు.

ఇటీవల లాక్‌డౌన్‌లో ఎదురైన సమస్యలను వినోదాత్మకంగా చూపిస్తూ రెండు ‘లాక్‌డౌన్‌ స్పెషల్స్‌’ ఎపిసోడ్స్‌ను ‘జీ 5’ వీక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఆ రెండూ అందర్నీ నవ్వించాయి. ఇప్పుడు సిటీలో డెంగ్యూ తీవ్రత ఎక్కువ కావడంతో అమృతరావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడనే నేపథ్యంలో ‘అమృతం ద్వితీయం’ 6వ ఎపిసోడ్‌... అమృత విల్లాస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించే సంజీవినీ ఆలోచనతో ఎపిసోడ్‌ 7... ఒక పుస్తక ఆవిష్కణ, తమ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనూహ్య మలుపులతో ఏ విధంగా దిగజారాయనే నేపథ్యంలో ఎపిసోడ్‌ 8 రూపొందాయి. అమృతం పాత్రలో హర్షవర్ధన్‌, అంజి పాత్రలో ఎల్‌.బి. శ్రీరామ్‌, అప్పాజీ పాత్రలో శివన్నారాయణ, సర్వం పాత్రలో వాసు ఇంటూరి, ఇతర పాత్రల్లో తదితరులు ‘అమృతం ద్వితీయం’లో నటిస్తున్నారు.

ZEE5 PREMIERES NEW EPISODES OF POPULAR ORIGINAL AMRUTHAM DHVITHEEYAM:

AMRUTHAM DHVITHEEYAM New Episodes Loded
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs