ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే - రష్మికలు నువ్వా నేనా అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఎవరైనా హీరో సినిమా మొదలెడితే పూజా హెగ్డే నా, రష్మికానా అని ఆలోచించే స్థితిలో ఈ ఇద్దరు భామలు ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మహేష్‌తో రష్మిక - అల్లు అర్జున్‌తో పూజా హెగ్డే జత కట్టారు. అలాగే పూజా హెగ్డే ప్రభాస్‌తో రాధేశ్యామ్ అంటూ పాన్ ఇండియా మూవీలో నటిస్తుంటే.. రష్మిక అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ చేయబోతుంది. అయితే రష్మిక ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. అలాగే పూజా హెగ్డే కూడా అంతే. ప్రస్తుతం వీళ్ళ చేతుల్లో రెండు మూడు సినిమాలున్నాయి. అయితే పూజా హెగ్డే మాత్రం యంగ్ హీరోలైనా, స్టార్ హీరోలైనా తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే ఒప్పేసుకుంటుంది.
కానీ రష్మిక అలా కాదు.. తనకి స్టార్ హీరోల ఛాన్స్ అయితేనే తన దగ్గరకి తెమ్మని తన మేనేజర్‌కి చెబుతుందట. ప్రస్తుతం లెవల్ మారింది. అందుకే ఇద్దరు హీరోయిన్స్ ఆఫర్ అయినా.. చిన్న హీరోల ఆఫర్ అయినా తన దగ్గర వరకు తేవొద్దని, కేవలం స్టార్ ఛాన్స్ ఉంటేనే రమ్మని చెబుతున్నదట. ఇంతకు ముందు నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో రష్మికకి సెకండ్ హీరోయిన్ పాత్ర వస్తే రిజెక్ట్ చేసింది అని న్యూస్ విషయంలోనే రష్మిక ఇలా మార్గదర్శకాలు పాస్ చేసిందట. ఇలాంటి వార్తల వలన తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.. అందుకే అలాంటి ఆఫర్ విషయంలో తనదాకా తేవొద్దని తన మేనేజర్‌కి స్ట్రిట్‌గా ఆర్డర్స్ పాస్ చేసిందట.