Advertisement
Google Ads BL

పాయల్ సలహాలు పాటించేద్దామా..?


 

Advertisement
CJ Advs

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమై.. ఇంట్లో రకరకాల వంటలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ప్రజలేనా.. హీరో, హీరోయిన్స్ కూడా తల్లితండ్రులు వండిన వంటలకన్నా.. తమకి తాముగా కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తున్నారు. రకుల్, సమంత లాంటివాళ్లు వండిన వంటలను తిని జిమ్ లో ఒళ్ళు కరిగించుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం బాగా తిని కాస్త బరువు పెరిగారు. అందుకే అలాంటి వాళ్ళకోసం పాయల్ రాజ్‌పుత్ చిట్కాలు చెబుతుంది. RX 100తో అందంగా మురిసిపోయిన పాయల్ రాజ్‌పుత్ ఆతర్వాత స్టార్ రేంజ్ అందుకోలేకపోయింది కానీ.. ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంది. కెరీర్ మొదలు పెట్టాక ఇన్నిరోజులు కుటుంబంతో గడపలేదని చెబుతున్న పాయల్.. లాక్‌డౌన్‌లో కాస్త ఎక్కువగా తిని ఒళ్ళు చేసిన వారికీ.. ఆ బరువు ఎలా తగ్గించుకోవాలో చిట్కాలు చెబుతుంది.

నేను కూడా లాక్‌డౌన్ సమయంలో నచ్చినవణ్ణి తినేసి కాస్త కండ పెంచి.. ఒళ్ళు చేశాను అని చెబుతుంది. ఆ ఒళ్ళు కరించుకోవడానికి రాత్రిపూట తినడం మానెయ్యమంటుంది పాయల్. రాత్రిపూట భోజనం మానేసి.. తేలికపాటి సూప్స్ అయినా.. జ్యూస్ లు అయినా తీసుకోండి. నేను కూడా అంతే. ఇంట్లోని పనులన్నీ నాకు నేనుగా చేసుకుంటున్నాను. దానితో పెద్దగా వర్కౌట్స్ చెయ్యకుండా ఒళ్ళు కరిగించుకోవచ్చు. అందుకే ఎవరి పనులు వారు చేసుకోండి అని చెబుతుంది. మరి జిమ్ లు, వరౌట్స్ లేకుండా ఎవరిపనులు వారు చేసుకుని.. ఓ పూట భోజనం మానెయ్యమని చెబుతుంది పాయల్. మరి మనం కూడా పాటించేద్దామా పాయల్ సలహాలు.

Payal Rajput says Weight Loss Tips And Secrets:

Payal Rajput Health tips to Her fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs