ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న హాట్ టాపిక్ ఏమిటి అంటే... ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ నెంబర్ వన్ అంటుంటే... రంగస్థలం లాంటి భారీ హిట్ కొట్టి.. ప్రస్తుతం RRR అంటూ పాన్ ఇండియా మూవీ చేస్తున్న రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉండడమేమిటా అని. తాజాగా టాలీవుడ్ హీరోల స్థానాల కోసం ఆర్మాక్స్ మీడియా ఓ సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలో టాలీవుడ్ నంబర్ వన్ హీరో అల్లు అర్జున్ అని, రెండో స్థానంలో మహేశ్ బాబు, మూడో ప్లేస్ లో ప్రభాస్ ఉన్నారని చెప్పింది. అంటే ఆర్మాక్స్ మీడియా కేవలం 2020 సంవత్సరానికి గాను ఈ సర్వే నిర్వహించింది. అందుకే అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అంటే ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ నెంబర్ వన్ అయితే సరిలేరు నీకెవ్వరుతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ సెండ్ స్థానంలో ఉన్నాడు. ఇక మూడో ప్లేస్ లో ప్రభాస్, నాలుగో ప్లేస్ లో పవన్, తర్వాత స్థానాల్లో జూనియర్ ఎన్టీఆర్, చిరు, విజయ్ దేవరకొండ, నాని ఉండగా.. తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు. అయితే ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే పై ఇప్పుడు బోల్డన్ని విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ ఏడాది ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని స్థానాలను డిసైడ్ చేసి ఉంటే.. ప్రభాస్ మూడో స్థానంలోకి ఎలా వస్తాడు. అసలు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ నాలుగో ప్లేస్ లో ఎలా ఉంటాడు.. అంటూ విమర్శలు సంధిస్తున్నారు. అసలు నాని, విజయ్ దేవరకొండ కన్నా వెనకబడి ఉండడానికి రామ్ చరణ్ ఎమన్నా తక్కువ క్రేజ్ ఉన్న హీరోనా.. అసలు ఆర్మాక్స్ మీడియా సర్వ్ చేసిన ఎవరికి టాలీవుడ్ గురించి ఎమన్నా తెలుసా అంటూ మెగా -ఫాన్స్ మండిపడుతున్నారు. అందుకే వారు ఎక్కడో ఏదో తేడా జరిగింది అంటున్నారు.