Advertisement
Google Ads BL

అన్నదమ్ముల దర్శకత్వంలో నాగార్జున సినిమా..?


తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో నాగార్జున సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నాన్ రుద్రమ్ అనే పేరుతో తెరమీదకి వచ్చిన ఈ సినిమాలో శరత్ కుమార్, ఎస్జే సూర్య, అరవింద్ స్వామి, అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. అయితే కొద్ది రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో ఇక సినిమా పూర్తిగా ఆగిపోయిందనే అనుకున్నారు.  నాగార్జున కూడా ఈ సినిమా విషయమై తనకేమీ తెలియదనీ, ధనుష్ స్పందిస్తేనే బాగుంటుందని చెప్పాడు. 

Advertisement
CJ Advs

అయితే పూర్తిగా ఆగిపోయిందనుకున్న ఈ సినిమా మళ్ళీ స్టార్ట్ కానుందని అంటున్నారు. బడ్జెట్ ని తక్కువ చేసేందుకు గాను ఈ సినిమా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసాడట. అయితే ఈ సినిమాలోని కొన్నిముఖ్యమైన సీన్లని ధనుష్ అన్న సెల్వరాఘవన్ చిత్రీకరించనున్నాడట. యుగానికి ఒక్కడు తరహాలో ఉండే ఆ సీన్లని సెల్వ రాఘవన్ అయితే బాగా తీయగలడన్న ఉద్దేశ్యంతో దనుష్ ఆ పనిని తన అన్నకి అప్పగించనున్నాడట. మరి అన్నదమ్ములు దర్శకత్వం చేయనున్న ఈ సినిమా మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాతో నాగార్జున బిజీగా ఉన్నాడు. 

Nagarjunas movie in brothers direction..?:

Nagarjunas movie in brothers direction..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs