Advertisement
Google Ads BL

‘సర్కారు వారి పాట’లో ఈ భామ కూడా!


నివేత థామస్ మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్. అయితే నివేత థామస్ కాస్త పొట్టిగా ఉండటం వలన ఆమెకి మంచి ఆఫర్స్ దక్కడం లేదనేది ఎంత నిజమో.. ఆమె గ్లామర్ షో చేయదనే కారణంగానూ ఆమెకి అవకాశాలు రావడం లేదనేది అంతే నిజం. అయితే ఈమధ్యన నివేత థామస్ చేసిన సినిమాలు గమనిస్తే... నివేత ఏ సినిమాలో నటించినా ఆ సినిమా కథ మలుపు తిప్పే పాత్రలు అండ్ ముఖ్యమైన కీలక పాత్రలే చేస్తుంది. తాజాగా అలాంటి పాత్రే స్టార్ హీరో సినిమాలో తగిలినట్లుగా టాక్. మహేష్ - పరశురామ్ కాంబోలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్టుగా ఆమెనే కన్ఫర్మ్ చేసింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు సెకండ్ హీరయిన్ అనే కన్నా సినిమాలో ఓ ముఖ్యమైన కీలక పాత్రకి నివేత థామస్‌ని ఎంపిక చేసినట్లుగా ఫిలింనగర్ న్యూస్. కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ అయినా.. నివేత పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకమని తెలుస్తుంది. అయితే నివేత థామస్ ఎక్కువగా ఇలాంటి కీలక పాత్రలకే పరిమితమవుతుంది. అయితే హీరోయిన్ పాత్ర లేదా మరొకటా అనేదానికన్నా పాత్రలో ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనేలా ఉంది నివేత థామస్ వ్యవహారం. మరి ఎన్టీఆర్‌తో కలిసి ‘జై లవ కుశ’లో నటించిన... నివేతకి ఆ తర్వాత స్టార్ హీరోలతో అవకాశాలు రాలేదు.. ఇప్పుడు మహేష్ సినిమాతో అయినా.. నివేత థామస్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పడుతుందేమో చూడాలి.

One More Heroine in Sarkaru Vaari Paata:

<span>Nivetha Thomas In Mahesh Babu Sarkaru Vaari Paata</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs