Advertisement
Google Ads BL

రాశీ ఖన్నా అన్నీ కనిపెట్టేసింది!


ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన హీరోయిన్స్ వంటగదిలో దూరి వంటలు ట్రై చేస్తున్నారు. తల్లితండ్రులతో, భర్తలతో కలిసి హ్యాపీ‌గా ఎంజాయ్ చేస్తున్న చాలామంది హీరోయిన్స్ ఈ లాక్‌డౌన్‌లో ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అందులో ఇప్పడు రాశి ఖన్నా కూడా చేరింది. నిజమైన అందమేమిటో.. నిజమైన ఐశ్వర్యం ఏమిటో ఇప్పటికైనా కనిపెట్టండి అంటుంది. కరోనా లాక్‌డౌన్ మనకి చాలా పాటలు నేర్పింది. ఎప్పటినుండో పోటీ ప్రపంచానికి అంకితమై.. అలుపెరుగని పోరాటం చేస్తూ పరుగులు పెట్టాం.. ఇప్పటికైనా ఆరోగ్యం పై శ్రద్ద పెట్టండి అంటుంది ఈ భామ. సంపదలోనే సుఖముందని అనుకున్నాం.. ప్రకృతి ప్రసాదించిన వాటిని ధ్వంసం చేశాం అందుకే మనకు ఈనాడు ఈ గతి పట్టింది అంటుంది.

Advertisement
CJ Advs

మన ఉనికిని మనమే ప్రశ్నించుకునేలా ఉంది నేటి పరిస్థితి. అసలు మనం చేసుకున్న తప్పిదాలే ఈనాడు కరోనా లాంటి కారకాలు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని మన జీవన సరళని మార్చుకుందాం. అందం ఆరోగ్యం ఎక్కడున్నాయో గుర్తిద్దాం. మీకో విషయం తెలుసా.. నేను ఇప్పటికే ఆ విషయాన్నీ కనుగొన్నానని అని చెబుతుంది రాశి ఖన్నా. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే. ఆరోగ్యమే మనకు గొప్ప సంపద. మానసిక ప్రశాంతత ఉంటే.. మనం జీవితంలో అన్ని సాధించినట్టే. సంతోషమే విలువైన ఆస్తి. మనం మన సంతోషాలను, బాధలను ఇతరులతో పంచుకుంటే.. అందం ఆరోగ్యం వాటంతట అవే వస్తాయంటుంది బూరి బుగ్గల రాశి ఖన్నా.

Raashi Khanna Talks about Nature:

Raashi Khanna learned so many things
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs