Advertisement
Google Ads BL

సమంత బిగ్‌బాస్ 4 హోస్ట్‌పై క్లారిటీ!


నిన్న ఒక్కసారిగా సోషల్ మీడియా, వెబ్ మీడియా మొత్తం అక్కినేని సమంత బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా చేయబోతుంది. అక్కినేని హీరో నాగార్జునకి సమంతకి బిగ్ ఫైట్, స్టార్ హీరోయిన్ బిగ్ బాస్ హోస్ట్ అంటూ పలురకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. అసలు బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుందో అనేది కరోనాతో క్లారిటీ లేదు. అందులోను సీజన 4 కి అక్కినేని నాగార్జునే హోస్ట్ అని ఇప్పటికే స్టార్ మా ఫిక్స్ అయినట్లుగా వార్తలు రావడం. ప్రస్తుతం కరోనా దృష్ట్యా బిగ్ బాస్ 4 ని 100 రోజుల నుండి 50 రోజులకు కుదించి షో లో పలు మార్పులు చేర్పులు చెయ్యబోతున్నట్టుగా వార్తలొస్తున్న వేళ హీరోయిన్ సమంత పేరు బిగ్ బాస్ సీజన్ 4 వ్యాఖ్యాత లిస్ట్‌లో చేరింది.

Advertisement
CJ Advs

గత సీజన్‌లో నాగార్జున హోస్ట్ చెయ్యగా మంచి టీఆర్పీ‌ని సొంతం చేసుకుంది బిగ్ బాస్. దానితో మళ్లీ భారీ పారితోషకానికి నాగార్జుననే సీజన్ 4 వ్యాఖ్యాతగా కంటిన్యూ చేస్తున్నారని అన్నారు. అయితే తాజాగా సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా ఖాళీగా మారిన సమంత బిగ్ బాస్ 4 హోస్ట్ చేయడం పక్కా అంటూ వార్తలొచ్చాయి. నాగార్జున కన్నా సమంత కున్న క్రేజ్ తో ఈ బిగ్ బాస్ సీజన్ 4 పై అంచనాలు పెంచొచ్చు అనే ఆలోచనతో సమంత ని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించగా.. సమంత కూడా సానుకూలంగా స్పందించింది అని అంటున్నారు. ఇక పారితోషకం కూడా కోట్లలో ఉంటుంది అని సమంతని ఒపించినట్లుగా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్. అయితే తాజాగా సమంత బిగ్ బాస్ 4 కి హోస్ట్ గా చెయ్యడం లేదని.. అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ అక్కినేని కాంపౌండ్ సమంత బిగ్ బాస్ 4 హోస్ట్ అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేసింది.

Clarity about Samantha Bigg Boss 4 Host:

Samantha not Hosted Bigg Boss 4 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs