Advertisement
Google Ads BL

మళ్లీ ట్రెండింగ్‌లోకి.. యాజమాన్యం ఫుల్ ఖుషి!


కరోనా లాక్‌డౌన్ ముందు ఈటీవీలో ఏ ప్రోగ్రాం చేసినా.. జబర్దస్త్ ప్రోమోస్ వదిలినా యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉండేవి. జబర్దస్త్, క్యాష్, ఢీ ప్రోగ్రామ్స్.. ఈటీవీకి ఆయువు పట్టులాంటి ప్రోగ్రామ్స్. యూట్యూబ్‌లోనే కాదు.. ఆ ప్రోగ్రామ్స్‌తో ఈటీవీలో బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చేవి. కానీ కరోనా లాక్‌డౌన్ వలన ఈటీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ అన్ని ఆగిపోయాయి. దానితో పాత ఎపిసోడ్స్‌నే టెలికాస్ట్ చేస్తూ టీఆర్పీని పోగుట్టుకున్న ఈటీవీ మళ్ళీ లాక్‌డౌన్ ముగియగానే తన పాత ట్రెండ్‌ని కొనసాగించాడనికి రెడీ అవడమే కాదు... ఇప్పటికే కొత్తగా సరికొత్తగా ఢీ, జబర్దస్త్ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అయ్యాయి. అంతేకాదు..యూట్యూబ్ లోను ఈటీవీ ఢీ, జబర్దస్త్, క్యాష్ ప్రోమోలు టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.

Advertisement
CJ Advs

సీరియల్స్ విషయంలో ఈటీవీ కాస్త వెనుకబడినా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ విషయంలో ఏ ఛానల్ కూడా ఈటీవీతో పోటీపడలేదు. జబర్ధస్త్ గత ఎనిమిదేళ్లుగా టాప్‌లో ఉన్న కామెడీ షో. ఇక క్యాష్ కూడా సుమ యాంకరింగ్‌తో టాప్ లెవల్లో దూసుకుపోతున్న షో. ఢీ అన్నిటిలోనూ ద బెస్ట్ డాన్స్ షో. మరి కరోనా లాక్‌డౌన్‌తో కాస్త వెనకబడినా ఈటీవీ షోస్ మొత్తం మళ్ళీ టాప్ ట్రెండింగ్‌లోకి రావడంతో యాజమాన్యం ఫుల్ ఖుషి‌గా ఉందట. మొన్ననే మొదలైన సీరియల్స్ షూటింగ్ కూడా ఆగిపోయిన టైం లో ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ బుల్లితెర ప్రేక్షకులకు దిక్కయ్యేలా ఉన్నాయంటున్నారు.

Jabardasth, Dhee, Cash Promos in Trending :

ETV Program Promos Trending 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs