Advertisement
Google Ads BL

అలాంటోడు శ్రీముఖికి ఎప్పుడు తగలాలి!


బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ అంటే ఎనర్జీకి మారుపేరు. ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే రణ్వీర్ సింగ్‌తో నటించాలని చాలామంది హీరోయిన్స్ కలలు కంటూ ఉంటారు. ఇప్పుడో తెలుగు యాంకర్ రణ్వీర్ సింగ్ అంటే క్రష్ అంటుంది. రణ్వీర్ సింగ్ లాంటి ఎనర్జీ లెవల్స్ ఉన్న మొగుడు కావాలంటుంది. ఆమె ఎవరో కాదు.. బిగ్ బాస్ సీజన్ త్రీ లో రన్నర్ గా నిలిచిన యాంకర్ శ్రీముఖి. ఈటీవీ, జీ తెలుగు షోస్ లో యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్‌తో అందరికి సుపరిచితురాలుగా మారింది. అయితే గతంలో పెళ్లి పేరెత్తితే మా అన్న ఎవరిని చూపిస్తే వాళ్లనే చేసుకుంటాను అనేదాన్ని అని.. లేదంటే నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మా నాన్న ఒప్పుకోరు అని చెప్పేదాన్ని.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు నా ప్రేమను మా తల్లితండ్రులు గౌరవిస్తారు, నా నిర్ణయాన్ని తప్పుబట్టారు అంటుంది. నేను లవ్ చేస్తే నా ఫ్యామిలీ సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు.. అందుకే నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అంటుంది శ్రీముఖి. లవ్ చేసినా పెద్దలని ఒప్పిస్తానని అంటుంది. అయితే తనకి కాబోయే వాడికి నాలాగే.. ఎనర్జీ లెవర్స్‌లో కాని.. కామెడీలో కాని.. కొంత పిచ్చి, వెర్రి ఉండాలి అలాంటి వాడైతే నాకు ఓకే అంటుంది. నేను ఓ వ్యక్తితో లవ్‌లో ఉన్నాను అంటే నా పేరెంట్స్‌కి చెప్తా. ఒకవేళ నా పేరెంట్స్ చూసిన అబ్బాయి అయితే.. అతనితో ట్రావెల్ చేసి లవ్ చేస్తాను అంటుంది. బేబీ అంటూ నా చుట్టూనే తిరగాలి, నాతో సాఫ్ట్‌గా కూల్‌గా ఉండాలి. బయట ఎలా ఉన్నా ఇంటికొచ్చాక నాతో చాలా నెమ్మదిగా ఇన్నోసెంట్ గా ఉండాలి. నాకు రణ్వీర్ సింగ్ అంటే క్రష్. అలాంటి హైపర్ యాక్టీవ్ ఉన్న అబ్బాయి కావాలని అంటుంది శ్రీముఖి. మరి శ్రీముఖి కోరికల చిట్టా చాలా పెద్దదే. అలాంటి వాడు శ్రీముఖికి ఎప్పుడు తగలాలి. 

Anchor Sreemukhi About Her Marriage:

Anchor Sreemukhi wants Ranveer Singh Type Husband
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs