ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్లదే హవా. సినియర్ హీరోయిన్లలో చాలా మందికి అవకాశాలే లేవు. కాజల్ మినహా మిగిలిన వారందరూ కనిపించడమే మానేసారు. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తూనే ఉండడంతో పాతవారికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. అలా అవకాశాలు తగ్గిపోయిన వారిలో ఇలియానా కూడా ఒకరు.
తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన గోవా బ్యూటీ బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంలో ఠపీమని అక్కడికి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ అందుకోవడంతో ఇక్కడ సినిమాల్లో కనిపించడమే మానేసింది. మరి దానికి కారణం ఆమే చేయడానికి ఇష్టపడలేదా లేక రెమ్యునరేషన్ ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్న కారణంగా నిర్మాతలే అడగలేదా అన్నది తెలియదు.
అయితే ప్రస్తుతం బాలీవుడ్ లోనూ కనిపించట్లేదు. ఇలాంటి టైమ్ లో తెలుగు సినిమా నుండి ఆమెకి ఆఫర్ వెళ్ళిందని సమాచారం. నితిన్ హీరోగా నటిస్తున్న అంధాధున్ తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర అయిన టబు రోల్ కోసం ఇలియానాని అడిగారట. హిందీలో లాగా కాకుండా ఆ పాత్ర ఏజ్ ని మరింత తగ్గించి ఇలియానాతో నటింపజేయాలని అనుకున్నారట. అయితే ఈ పాత్రలో చేయడానికి ఆమె ఒప్పుకోలేదని సమాచారం.
అయితే దానికి కారణం హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని ఆశపడడమే అని అంటున్నారు. ఇప్పుడప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం కంటే మరిన్ని రోజులు ఆగితే బెటర్ అని భావిస్తుందట.