భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. ఆయన తెరకెక్కించిన శివ, రంగీలా, క్షణక్షణం, కంపెనీ, సత్య చిత్రాలు కల్ట్ క్లాసిక్ గా నిలిచాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే వివాదాలే. సమాజంలో జనాల నోళ్లలో బాగా నానిన సంఘటనని తీసుకుని తనదైన శైలిలో పబ్లిసిటీ తీసుకువచ్చి సినిమా తెరకెక్కించేసి జనాల్లోకి వదులుతుంటాడు.
ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాలకి ఎంత పబ్లిసిటీ వస్తుందో అయన ఇంటర్వ్యూలు కూడా అదే రీతిలో ట్రెండ్ అవుతుంటాయి. ఏది మాట్లాడాలన్నా మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పే రామ్ గోపాల్ వర్మ తాజాగా యాంకర్ ని కోరిన కోర్కె అందరికీ షాకింగ్ లా ఉంది. మనుషులకి కోరికలు సహజం. అవి తీరకపోతే బాధపడుతుంటారు. అలా మీరెప్పుడైనా బాధపడ్డారా.. మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించింది.
దానికి సమాధానంగా రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా సమాధానమిచ్చాడు. నాకు తీరని కోర్కెలు ఏమీ లేవు. నేను ఎప్పుడు ఏమి కావాలనుకున్నా అది తీర్చేసుకుంటాను. ఒకవేళ తీరదని తెలిస్తే వెంటనే మర్చిపోతా.. నిజానికి మిమ్మల్ని బికినీలో చూడాలని కోరికగా ఉంది. మీరు ఓకే అంటే ఆఫర్ ఇస్తా అనేసరికి యాంకర్ కి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. అలా ఓపెన్ గా మాట్లాడిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. మొత్తానికి యాంకర్ ని తన కోర్కెతో భయపెట్టేసాడుగా..!