Advertisement
Google Ads BL

బిత్తిరి సత్తిని పంపేయడానికి కారణం అదేనా?


ఇప్పుడు టీవీ 9 నుండి బిత్తిరి సత్తిని తీసెయ్యడం మీడియా వర్గాల్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. తింగరి తింగరిగా ఉంటూ... తింగరి మాటలతో.. తెలుగుని ఖుని చేసే బిత్తిరి సత్తి ప్రోగ్రామ్స్ ని వీక్షించే ప్రేక్షకులు ఎక్కువే. అందుకే టివి 9 లో బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, బిత్తిరి సత్తితో ఇస్మార్ట్ అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రాం చేసేవారు. అయితే ఆ ప్రోగ్రాం నుండి టీవీ9 నుండి బిత్తిరి సత్తిని బయటికి పంపేశారు. అయితే బిత్తిరి సత్తి బయటికొచ్చింది బిగ్ బాస్ 4 లో పాల్గొంటానికే కానీ.. మరేందుకు కాదు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా టివి 9 యాజమాన్యం బిత్తిరి సత్తిని కావాలనే తీసేసిందట. బిత్తిరి సత్తి ఇస్మార్ట్ కి పెద్దగా టీఆర్పీ రావడం లేదట. గతంలో V6 లో బిత్తిరి సత్తి చేసిన కార్యక్రమంతో పోలిస్తే.. టీవీ 9 ఇస్మార్ట్ ప్రోగ్రాం కి అసలు క్రేజ్ రావడం లేదు. అలాగే చాలా పారితోషకం ఇస్తున్నాము మనకెందుకులే అని బిత్తిరి సత్తిని టీవీ 9 తొలగించినట్లుగా మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో బిత్తిరి సత్తి టీవీ 9 నుండి బయటికి రావడానికి వేరే కారణముంది.. అది కూడా ఈమధ్యనే జరిగిన ఫాదర్స్ డే రోజున బిత్తిరి సత్తి తన ఫాదర్ గురించి ఏదేదో మాట్లాడడం... అది కాస్త టీవీ9లో ఎలాంటి ఎడిటింగ్ లేకుండా టెలికాస్ట్ అవడంతో.. అది ఇప్పుడు యాజమాన్యం దృష్టికి రావడంతో... అప్పటికే తిక్కరేగి ఉన్న యాజమాన్యం బిత్తిరి సత్తిని తొలగించారని టాక్. బిత్తిరి సత్తి ప్రోగ్రాం మేనేజర్‌ని మ్యానేజ్ చేసి తాను మాట్లాడిన వెర్షన్ మొత్తం ప్రసారం అయ్యేలా చూశాడని అందుకే టీవీ9 వారు సత్తికి ఉద్వాసన పలికారని సోషల్ మీడియాలో కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజం ఏదో తెలియాలంటే బిత్తిరి సత్తి ఫాఫం అనాల్సిందే.

Bittiri Satti and Team out from TV 9 news channel:

After V6, Bittiri Satti says goodbye to tv 9
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs