Advertisement
Google Ads BL

రానా కోసం హాలీవుడ్ రాబోతుంది..?


తెలుగు హీరోలందరిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రానా దగ్గుబాటి, బాహుబలి సినిమాలో భళ్లాలదేవగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. భారతదేశం గర్వించదగ్గ సినిమాలో విలన్ గా మెప్పించిన రానాతో సినిమా తీయడానికి అందరూ రెడీగా ఉంటారు. ప్రస్తుతం రానా చేతిలో మూడు సినిమాలున్నాయి. ప్రభు సోలోమన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన అరణ్య చిత్రంతో పాటు దాదాపుగా సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న విరాట పర్వం మరొకటి.

Advertisement
CJ Advs

ఈ రెండు చిత్రాలతో పాటు ఇప్పుడిప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న హిరణ్యకశ్యప కూడా లిస్టులో ఉంది. ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలని రూపొందించిన గుణ శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన రుద్రమదేవి సినిమా అనంతరం హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్న గుణశేఖర్ ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసుకున్నాడట.

సురేష్ ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాలని అనుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడానికి హాలీవుడ్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అయిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉందని వార్తలు వస్తున్నాయి. రానా ప్రధాన పాత్రలో హిరణ్యకశ్యపుడిగా రూపోందనున్న ఈ పౌరాణిక చిత్రంపై ఇన్వెస్ట్ చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ రానుందట. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కి మధ్య చర్చలు జరుగుతున్నాయట. మరేం జరగనుందో చూడాలి.

hollywood production house will part of Ranas film..?:

hollywood production house will part of Ranas film..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs