Advertisement
Google Ads BL

రష్మిక బూస్ట్ అప్.. పెంగ్విన్ పైకి లేస్తుందా..?


మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్ నిర్మాతగా స్టోన్ బెంచ్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన పెంగ్విన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లు మూతబడిన కారణంగా ఓటీటీ వేదికగా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కన్నబిడ్డని బిడ్డని పోగొట్టుకున్న తల్లిగా కనిపించింది. అనేక అంచనాల మధ్య విడుదల అయిన ఈ మిస్సింగ్ థ్రిల్లర్ కి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. అయితే సినిమా అనేది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. సోషల్ మీడియాలో పెంగ్విన్ చిత్రంపై అనేక నెగెటివ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ, పాజిటివ్ రివ్వూస్ కూడా వస్తుండటం విశేషం.

స్టార్ హీరోయిన్ రష్మిక పెంగ్విన్ చిత్రాన్ని పొగుడుతూ మెసేజ్ పెట్టింది. రష్మిక మెసేజ్ చేస్తూ, నిన్న రాత్రే పెంగ్విన్ చిత్రాన్ని చూసాను. అందులో కీర్తి నటన ప్రతీ సినిమాలో లాగే చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతీ ఒక్క తల్లికి సంబంధించిన కథ అని చెప్పగలను. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడని ప్రశంసల వర్షం కురిపించింది. మరి రష్మిక మాటలు ఆ సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.

Rashmika praises Penguin movie.. Will it rise :

Rashmika praises Penguin movie.. Will it rise 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs