హైదరాబాద్‌లోని చాలామంది సెలబ్రిటీ పీపుల్స్ తమ సొంత ఇళ్లలో కన్నా ఎక్కువగా ఖరీదైన హోటల్స్‌లోనే బస చేసి తమ సినిమాలకు సంబంధించిన మీటింగ్స్ కానివ్వండి, కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ కానివ్వండి, ప్రెస్ మీట్స్ కానివ్వండి ఇలా చాలామంది ప్రముఖులు హోటల్స్‌లోనే తమ కార్యకలాపాలు సాగిస్తారు. చాలామంది పెద్ద సెలెబ్రిటీస్ అయితే.. హోటల్స్‌నే ఇంటిగా మార్చుకుని యాజమాన్యానికి లక్షల్లో అద్దెలు చెల్లిస్తారు. అలా హైద్రాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పార్క్ హయత్‌తో చాలామంది సినీ సెలబ్రిటీస్ తమ రోజువారీ కార్యక్రమాలు, అలాగే త్రివిక్రమ్ లాంటి వాళ్ళు హెటల్ గదులను నెలలు నెలలు అద్దెకి తీసుకుని అక్కడే స్టే చేస్తారు. అయితే హోటల్స్‌లో తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే.. సెలబ్రిటీస్‌కి భద్రతా లేదేమోలే అనిపించక మానదు.
నిన్న మంగళవారం జరిగిన ఓ ఇన్సిడెంట్ చూస్తే అదే అనిపిస్తుంది. మంగళవారం బీజేపీలోని పెద్ద తలకాయలైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ని ఏపీ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ సీక్రెట్ గా కలిసినట్టుగా వచ్చిన వార్తలకు పార్క్ హయ్యత్ లోని సిసి టివి ఫుటేజ్ ఛానల్స్ లో ప్రత్యక్షమవడంతో సెలెబ్రిటీస్ చాలామంది షాకయ్యారట. ఏదో సీక్రెట్ గా హోటల్స్ లో తమ పని తాము చేసుకుంటుంటే.. ఇప్పుడు ఇలా సీక్రెట్ గా ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజ్‌లు చానల్స్‌కి ఎక్కితే తమ పరిస్థితి ఏమిటా అని తలలు పట్టుకుంటున్నారట. తాము చాలా విషయాల్లో చాలామందిని కలుస్తుంటాము. ఇలా తమ సీక్రెట్స్ అన్ని ఎక్కడ బయటికొస్తాయో అనే కంగారులోనూ వాళ్ళు ఉన్నారట. మరి అంత పెద్ద హోటల్ లోనే సెలబ్రిటీస్ కి రక్షణ లేకపోతే.. ఇంకెక్కడుంటుంది అంటున్నారట.