అప్పుడెప్పుడో సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా నేను ‘మోనార్క్’ని నన్నెవరూ మోసం చెయ్యలేరు అంటూ చెప్పే డైలాగ్ ఆ సినిమాలో బాగా పేలినట్లుగా.. ఇప్పుడు బాలకృష్ణ కూడా నేను మోనార్క్ అనబోతున్నాడట. బోయపాటి - బాలయ్య కాంబోలో ముచ్చటగా మూడో సినిమాగా రాబోతున్న పవర్ ఫుల్ కథకి మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాల వలే బాగా పవర్ ఫుల్‌గా ఈ మూడో సినిమా ఉండబోతోంది అని మొన్నామధ్యన వదిలిన టీజర్‌తో అర్థమైంది.
అయితే ఈ సినిమా టైటిల్ విషయలో ఇప్పటివరకు ఎక్కడా న్యూస్ లేదు కానీ.. గత రెండు రోజులుగా బాలయ్య - బోయపాటి సినిమా టైటిల్‌గా ‘మోనార్క్’ ప్రచారంలోకి రావడం.. బాలయ్యకి పర్ఫెక్ట్ టైటిల్ అంటున్నారు నందమూరి అభిమానులు. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి.. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉందిరా ల****కా అనే డైలాగ్‌కి ఈ టైటిల్ అయితే సూపర్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. సింహ, లెజెండ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య-బోయపాటి మూడో సినిమా ‘మోనార్క్’తో హ్యాట్రిక్‌పై కన్నేశారు.